ETV Bharat / crime

ఇంకా ఎన్నాళ్లీ నిరీక్షణ... అదృశ్యమైన వారు ఏమవుతున్నారు?

author img

By

Published : Oct 15, 2022, 8:22 AM IST

What happens to missing persons: ఇంటి వెళ్లిన వ్యక్తులు ఏమవుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు వారు ఏమవుతున్నారు? అన్న సందేశాలు అందరిలో మెదులుతున్నాయి. పోలీసుల దర్యాప్తు సంక్రమంగా లేదా లేక వెళ్లివారు బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకుంటున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

What happens to missing persons
తప్పిపోయిన వ్యక్తులు ఏమవుతున్నారు

What happens to missing persons: సంచలనం సృష్టించిన హాజీపూర్‌ దురాగతం గుర్తుందా? భువనగిరి జిల్లాలో సైకో కిల్లర్‌ శ్రీనివాసరెడ్డి సాగించిన కిరాతకానికి ఆనవాళ్లుగా ముగ్గురు బాలికల అస్థిపంజరాలు బయటపడ్డాయి. మూడో బాలిక అదృశ్యంపై దర్యాప్తు క్రమంలో ఏళ్ల తరబడి కనిపించకుండాపోయిన మరో ఇద్దరు బాలికల మృతి ఉదంతం బయటపడింది. 2005లో కర్నూలుకు చెందిన ఓ కుటుంబం చార్మినార్‌ను చూసేందుకు వచ్చినప్పుడు రెండున్నరేళ్ల చిన్నారి తప్పిపోయింది.

.

ఈ చిన్నారి పేరు సంతోష్‌. శంషాబాద్‌ ఆర్‌బీనగర్‌కు చెందిన కొత్తపల్లి నరేశ్‌ కుమారుడు. 2012 జులైలో సోదరితో కలిసి బడికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు నాలుగేళ్ల ఆ బాలుడిని అపహరించారు. కేసు పెట్టినా పోలీసులు ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఏపీలోని ఒంగోలు నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చి నివసిస్తున్న నరేశ్‌.. ఠాణా చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

సంచలనం సృష్టించిన హాజీపూర్‌ దురాగతం గుర్తుందా? భువనగిరి జిల్లాలో సైకో కిల్లర్‌ శ్రీనివాసరెడ్డి సాగించిన కిరాతకానికి ఆనవాళ్లుగా ముగ్గురు బాలికల అస్థిపంజరాలు బయటపడ్డాయి. మూడో బాలిక అదృశ్యంపై దర్యాప్తు క్రమంలో ఏళ్ల తరబడి కనిపించకుండాపోయిన మరో ఇద్దరు బాలికల మృతి ఉదంతం బయటపడింది. 2005లో కర్నూలుకు చెందిన ఓ కుటుంబం చార్మినార్‌ను చూసేందుకు వచ్చినప్పుడు రెండున్నరేళ్ల చిన్నారి తప్పిపోయింది. హుస్సేనిఆలం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టినా, దర్యాప్తు ఏళ్ల తరబడి ముందుకు కదల్లేదు.

గత ఏడాది ఆపరేషన్‌ స్మైల్‌-7లో భాగంగా మియాపూర్‌లోని రక్షితగృహంలో ఉన్న ఆ బాలికను గుర్తించి తల్లిదండ్రుల ఒడికి చేర్చారు. ఈ రెండు కేసులు ముందుకు సాగకపోవడానికి పోలీసుల వైఖరే కారణమైతే.. సుదీర్ఘకాలం తర్వాత ఆ కేసులు కొలిక్కి రావడానికీ అదే పోలీసుల చొరవ కారణమైంది. తెలంగాణలో ఏర్పాటైన మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లు (ఏహెచ్‌టీయూ) జటిలమైన అదృశ్యం కేసులను పర్యవేక్షిస్తున్నా పెద్దగా పురోగతి ఉండటంలేదు. పనిఒత్తిడి, ఇతర ప్రాంతాలకు వెళ్లి రోజుల తరబడి దర్యాప్తు చేసేందుకు వీల్లేకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. సంచలనం సృష్టించిన ఉదంతాల్లో మాత్రమే ప్రత్యేక దృష్టి సారించే పోలీసులు.. అలాంటి సందర్భాల్లో దాదాపు సఫలీకృతమవుతున్నారు. కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్‌ 57 ప్రకారం.. అదృశ్యం కేసు నమోదైతే తేలేవరకు దర్యాప్తు కొనసాగించాలి. మనకూ అలాంటి చట్టం ఉండాలని కొందరు సూచిస్తున్నారు.

అదృశ్యమైన వారు ఏమవుతున్నారు?.. వ్యభిచారగృహాలు.. భిక్షాటన.. చిన్నారులను అపహరించే దుండగులు.. వారిని వ్యవస్థీకృత ముఠాలకు అమ్మేస్తుంటారు. ఆ ముఠాలు పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నాయి. బాలికలను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నాయి. గతంలో యాదగిరిగుట్ట వ్యభిచారగృహాల్లో తనిఖీలు చేసినప్పుడు ఈ విషయం బహిర్గతమైంది. ఏళ్ల కిందట ఎక్కడో అపహరణకు గురైన బాలికలు అక్కడి కూపాల్లో మగ్గుతున్నట్లు తేలింది.

ప్రేమ పేరిట వంచన.. 15-18 ఏళ్ల వయసు బాలికలు ఎక్కువగా ప్రేమ పేరుతో వంచకులు చెప్పే మాయమాటలు నమ్మి.. ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నారు. మోసం బయటపడడం, డబ్బులు అయిపోవడం వంటి కారణాలతో తమంతట తామే తిరిగి ఇంటికి వస్తున్నారు. ఆచూకీ తెలియని కేసుల్లో పోలీసుల దర్యాప్తునకు సాంకేతిక అంశాలు అడ్డొస్తున్నాయి. అదృశ్యమైనవారు పుణ్యక్షేత్రాలు, దూర ప్రాంతాల్లో ఉంటున్న కారణంగా అక్కడికి వెళ్లి రోజుల తరబడి వెతికేందుకు సిబ్బంది కొరత కారణంగా పోలీసులు సమయం వెచ్చించలేకపోతున్నారు.

పెద్దల గుర్తింపు కష్టమే .. ఆర్థిక ఇబ్బందులు.. మతిస్థిమితం కోల్పోవడం.. వృద్ధాప్యంలో అయినవారి ఆదరణ కరవవడం లాంటి కారణాలతో ఇళ్ల నుంచి వెళ్లిపోతున్న పెద్దలను గుర్తించడం మాత్రం కష్టమవుతోంది. ఆచూకీని పట్టిచ్చే సెల్‌ఫోన్‌, ఏటీఎం, సామాజిక మాధ్యమాల వంటివి వృద్ధులు వినియోగించరు కనుక వారిని కనిపెట్టడం కష్టమవుతోంది.

అన్నపూర్ణ ఏమైందో!.. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన అన్నపూర్ణ (37) జీవితంపై విరక్తితో ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు లేఖ రాసి మార్చి 6న అదృశ్యమయ్యారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినా ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఆమె బయటికి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ కూడా దొరకలేదు.

.

ఆమె అదృశ్యంపై ఎవరిదో హస్తం ఉందని, తన వద్ద ఆధారాలున్నాయని భర్త సత్యమూర్తి చెబుతున్నారు. పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడంలేదంటూ ఆయన తన ఇద్దరు కుమార్తెలతో సహా గత జూన్‌లో అదృశ్యమయ్యారు. పోలీసులు అతి కష్టమ్మీద వారిని తిరిగి తీసుకువచ్చినా అన్నపూర్ణ ఆచూకీ తెలియలేదు.

2006 నుంచి ఎదురుచూపులే.. మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన సీతారాములు హైదరాబాద్‌ రామంతాపూర్‌లో పాలిటెక్నిక్‌ చదువుతూ 2006లో అదృశ్యమయ్యారు. కుటుంబసభ్యులు అప్పట్లో ఉప్పల్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. 16 ఏళ్లుగా ఠాణా చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో గత జూన్‌లో హైకోర్టును ఆశ్రయించారు. కేసులో తాజా స్థితిని ఈ నెల 27లోగా తెలపాలని న్యాయస్థానం పోలీసుల్ని ఆదేశించింది.

.

‘మా తమ్ముడి కాల్‌డేటా పరిశీలిస్తే ఏదైనా ఆధారం దొరుకుతుందని ప్రాధేయపడినా పోలీసులు పట్టించుకోలేదు. అతడి స్నేహితుడిపై అనుమానంతో ప్రశ్నిస్తే.. పది రోజుల్లోగా ఆచూకీ చెబుతానన్నాడు. అదే సమయంలో మా తమ్ముడు చర్లపల్లి జైల్లో ఉన్నాడంటూ ఓ పోలీసు ఉన్నతాధికారి దగ్గరుండే వ్యక్తి మమ్మల్ని తప్పుదోవ పట్టించాడు. తర్వాత తమ్ముడి స్నేహితుడి గురించి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. అతడి అదృశ్యం వెనక ఎవరిదో బలమైన హస్తం ఉందని మా అనుమానం’ అని సీతారాములు సోదరుడు శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు.

.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.