ETV Bharat / crime

ప్రేమ పేరుతో... బాలికను గర్భవతిని చేసిన యువకుడు

author img

By

Published : Feb 27, 2022, 8:21 PM IST

Crime News: ఏపీలో జరిగిన వేర్వేరు ఘటనల్లో పలువురు అరెస్టయ్యారు. ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసిన యువకుడిని ప్రకాశం జిల్లా తాడివారిపల్లె పోలీసులు అరెస్ట్ చేయగా... బెళుగుప్ప మండలంలో జింక మాంసాన్ని వండుతున్న వ్యక్తిని అనంతపురం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ap crime news
ఏపీ నేర వార్తలు

Crime News: ఆంధ్రప్రదేశ్​లో జరిగిన వేర్వేరు ఘటనల్లో పలువురు అరెస్టయ్యారు. మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి గర్భవతిని చేసిన యువకుడిని ప్రకాశం జిల్లా తాడివారిపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. తర్లుపాడు మండలం నాగేళ్లముడిపి గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమపేరుతో వంచించి అత్యాచారానికి పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. బాలిక అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు సమీపంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆరో నెల గర్భవతని తెలిపారు. గర్భం తొలగించేందుకు బాలికను అక్కడి నుంచి ఒంగోలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరాతీశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు దర్శి డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి వెల్లడించారు.

జింక మాంసాన్ని వండుతుండగా..

అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం విరుపాపల్లిలో ఓబులయ్య అనే వ్యక్తి నుంచి పోలీసులు జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2 కిలోల మాంసాన్ని వండుతుండగా... రెండ్ హ్యాండెడ్​గా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఓబులయ్యను అదుపులోకి తీసుకొని కల్యాణదుర్గం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. అతనిపై కేసు నమోదు చేశారు.

నకిలీ బంగారం విక్రయించి ... 15 లక్షల నగదుతో...

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో ఈనెల 22న నకిలీ బంగారం విక్రయించి ... రూ. 15 లక్షల నగదుతో ఉడాయించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో సిరిసిల్ల జిల్లా లింగంపేటకు చెందిన సుధీర్.. ఐదుగురు ముఠా సభ్యులతో కలిసి రూ. 15 లక్షలతో డబ్బుతో ఉడాయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. గోరంట్ల సమీపంలోని తమ్మినాయన పల్లి క్రాస్ వద్ద ఆదివారం ఉదయం వెంకటేష్, నరేశ్​, ఐజాం, శ్రీకృష్ణలను అరెస్ట్ చేయగా.. మొదటి ముద్దాయి నవీన్ పరారీలో ఉన్నారని సీఐ జయ జయ నాయక్ పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని యువకుడిని మోసగించిన ముఠా...

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువకుడిని మోసగించిన ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ఎర్రగుంట్లపాడుకు చెందిన మేకల నరేశ్.. ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అతనికి అమరావతి మండలం కర్లపూడికి చెందిన కుంభా వెంకటేశ్వర్లు, అతని స్నేహితులు పరిచయమయ్యారు. వెలగపూడిలోని సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్​గా ఉద్యోగం ఇప్పిస్తామని.. నెలకు రూ. 70 వేలు వస్తుందని నమ్మించారు. వారి మాటలు నమ్మి బాధితుడు విడతల వారీగా రూ. 11 లక్షల 50 వేలు చెల్లించాడు. ఎన్నాళ్లకు ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

మెకానిక్ షెడ్‌లో అగ్ని ప్రమాదం..

కడప శివారు వినాయకనగర్‌లోని ఓ ట్రాక్టర్ల మెకానిక్ షెడ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్మికులు వాహనాలకు ఇంధనం మార్పిడి చేస్తుండగా... షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. భయంతో కార్మికులంతా షెడ్‌ నుంచి పరుగులు తీశారు. ప్రమాదంలో షెడ్​లో ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

అక్రమంగా తరలిస్తున్న రాయితీ బియ్యం...

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రాయితీ బియ్యాన్ని గుంటూరు జిల్లా మేడి కొండూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేరేచర్ల బైపాస్ రోడ్డులో ఉన్న ఓ గోదాం నుంచి లారీలో బియ్యం తరలిస్తున్నారని స్థానికులు 100 నెంబరుకు ఫోన్ చేయడంతో ఉన్నతాధికారులు లారీని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

ఇదీ చదవండి: Driver rapes woman: కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్​ అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.