ETV Bharat / crime

ఆమెకు 30.. అతడికి 21.. సహజీవనం చేస్తున్న ఇద్దరి అనుమానాస్పద మృతి

author img

By

Published : Jan 29, 2023, 10:56 AM IST

Updated : Jan 29, 2023, 11:48 AM IST

Suspicious Death In Hyderabad: భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోతే కూలీ పనులు చేసుకుంటూ నలుగురు పిల్లలను పోషిస్తోంది. ఇంతలోనే 21 ఏళ్ల యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీయడంతో అతడితోనే మూడేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఏమైందో ఏమో తెలీదు గానీ.. శనివారం ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా కనిపించారు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

Two died
ఇద్దరు మృతి

Suspicious Death In Hyderabad: సహజీవనం చేస్తున్న ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన హైదరాబాద్​లోని ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలాపూర్‌ మండల్‌ లెనిన్‌నగర్‌కు చెందిన తూర్పాటి చెన్నమ్మ కుమార్తె సరస్వతి(30)కి 13 ఏళ్ల క్రితం శివ అనే వ్యక్తితో వివాహమైందని ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో శివ మృతి చెందాడు. తల్లి చెన్నమ్మ, సోదరుడు యాదగిరి సూచనతో.. నాటి నుంచి సరస్వతి లెనిన్‌నగర్‌లోనే ఉంటూ కూలీ పనులు చేయసాగింది.

నలుగురు పిల్లలనూ ఓ వసతి గృహంలో చేర్పించి చదివిస్తుంది. కుర్మల్‌గూడ రాజీవ్‌గృహకల్పలో సాదుల మహేందర్‌(21) నివసిస్తున్నాడు. మూడేళ్ల నుంచి అతడితో సరస్వతి సహజీవనం సాగిస్తోంది. తల్లి చెన్నమ్మ, అన్న యాదగిరి వారించినా వినకుండా.. మహేందర్‌తో తన పెళ్లి అయ్యిందని చెప్పి అతడితోనే ఉండసాగింది. ఇటీవల మహేందర్‌, సరస్వతి మధ్య తరుచూ ఘర్షణ పడసాగారు. దీంతో లెనిన్‌నగర్‌లోని పుట్టింటికి ఆమె చేరుకుంది.

వారం రోజుల క్రితం తిరిగి మహేందర్‌ వద్దకు వెళ్లింది. శనివారం తెల్లవారుజామున సరస్వతి, మహేందర్‌లు.. రాజీవ్‌గృహ కల్పలోని నివాసంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయారని బంధువుల ద్వారా తెలిసింది. దీంతో సరస్వతి కుటుంబీకులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లారు. అక్కడ సరస్వతి మృతదేహం నేలపై పడి ఉండగా.. మహేందర్‌ ఉరి వేసుకొని కనిపించాడు. యాదగిరి ఫిర్యాదుతో పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 29, 2023, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.