ETV Bharat / crime

selfie video while commiting suicide: 'నా భార్య హెడ్​ కానిస్టేబుల్​తో ఆ బంధం కొనసాగిస్తోంది'

author img

By

Published : Sep 21, 2021, 11:52 AM IST

Updated : Sep 21, 2021, 12:11 PM IST

ఏపీలోని కృష్ణా జిల్లా కేశ్యాతండాలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను మానసికంగా వేధిస్తోందని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

selfie-video-while-commiting-suicide-in-keshyathanda-krishna-district
selfie-video-while-commiting-suicide-in-keshyathanda-krishna-district

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్​ కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు కేశ్యాతండాకు చెందిన భరోతు వెంకటేశ్వరరావు.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన హెడ్ కానిస్టేబుల్​తో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తాను మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశాడు.

విజయవాడ హెడ్​కానిస్టేబుల్​ నాగబాబును.. నా భార్యను రెడ్​ హ్యాండెడ్​గా చాలా సార్లు పట్టుకున్నాను. కేసు ఎఫ్​ఐఆర్​ కూడా పెట్టి.. అతనిని సస్పెండ్ చేయించాను. ఇప్పుడు తన భార్య నాగబాబుతో వెళ్లిపోవడానికి సిద్ధపడి.. నాకు డివార్స్​ ఇవ్వడానికి చూస్తోంది. కావాలనే పోలీసు కంప్లైంట్​ ఇచ్చి నన్ను చిత్రహింసలకు గురిచేస్తోంది. హంతకుడిలాగా బేడీలు వేసి... కక్ష పెంచుకుని.. వేరు వేరు కేసులు పెట్టారు. అందరి ముందు నా పరువు తీశారు. నేను చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నా. నా చావుకు కారణం మా ఆవిడే. నా తల్లితండ్రులను జాగ్రత్తగా చూసుకోండి.

-భరోతు వెంకటేశ్వరరావు

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బాధితుడిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.

ఇదీచదవండి: Software Employee Died: విద్యుత్ తీగ తెగిపడింది.. ప్రాణం తీసింది..

Last Updated : Sep 21, 2021, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.