ETV Bharat / crime

vsp rape: ఏపీలో దివ్యాంగురాలిపై అత్యాచారం.. ట్విట్టర్​లో లోకేశ్​ ఫైర్

author img

By

Published : Sep 22, 2021, 4:12 PM IST

ఏపీలో దారుణం జరిగింది. కన్ను మిన్ను కానని ఓ కామాంధుడు దివ్యాంగురాలిపై అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. వైకాపా నాయకుడు వెంకట్రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

vishaka rape incident
విశాఖపట్నం జిల్లాలో అత్యాచారం

ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఓ దివ్యాంగురాలిపై అత్యాచారం జరిగింది. ఈ విషయాన్ని బాధితురాలే పోలీసులకు తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ.. ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో వైకాపా నాయకుడు వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. వైకాపా రేపిస్టుల తరఫున వకాల్తా పుచ్చుకుని పోలీసులు ప్రెస్​మీట్లు పెట్టొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు పాల్పడుతుంటే... తామేమీ తక్కువ తినలేదంటూ వైకాపా నేతలు అత్యాచారాలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు.

  • వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే, తామేమి తక్కువ తినలేదంటూ వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. కాటికి కాలుచాపే వయస్సులో అన్నీ చేయించుకోవాలనే ఆత్రపడే కాంబాబు, అరగంట పనోడు అవంతిని ఆదర్శంగా తీసున్నాడేమో?(1/3)

    — Lokesh Nara (@naralokesh) September 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సభ్యసమాజం తలదించుకునేలా విశాఖ వైకాపా నాయకుడు వెంకట్రావు దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని లోకేశ్ పేర్కొన్నారు. సాయం అందించాల్సిన చేతులే చిదిమేయడం ఘోరమన్నారు. పోలీసులకు చేతనైతే... నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

  • వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే, తామేమి తక్కువ తినలేదంటూ వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. కాటికి కాలుచాపే వయస్సులో అన్నీ చేయించుకోవాలనే ఆత్రపడే కాంబాబు, అరగంట పనోడు అవంతిని ఆదర్శంగా తీసున్నాడేమో?(1/3)

    — Lokesh Nara (@naralokesh) September 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • వైకాపా రేపిస్టుల తరపున పోలీసులు వకాల్తా పుచ్చుకుని.. చచ్చు మాటలు పుచ్చు వాదనలతో ప్రెస్ మీట్ పెట్టొద్దు. మీకు చేతనైతే, మీరు నిజమైన పోలీసులైతే నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయండి.(3/3)@APPOLICE100

    — Lokesh Nara (@naralokesh) September 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: అవసరం లేకున్నా సిజేరియన్లు... ప్రభుత్వాసుపత్రుల్లో 34%, ప్రైవేటులో 66% కోతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.