ETV Bharat / crime

ఆన్‌లైన్‌ బెట్టింగ్ ముఠా అరెస్టు.. వారి ఖాతాల్లోని రూ.24 కోట్లు సీజ్‌

author img

By

Published : Jan 30, 2023, 10:08 AM IST

Updated : Jan 30, 2023, 12:19 PM IST

online betting
online betting

06:18 January 30

ఆన్‌లైన్‌లో గేమింగ్, బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా అరెస్టు

ఆన్‌లైన్‌లో గేమింగ్, బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా అరెస్టు

Online betting gang arrest in Hyderabad : హైదరాబాద్ పీర్జాదిగూడలో మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు ఓ జూద శిబిరంపై దాడులు చేసి, ఆన్‌లైన్‌లో గేమింగ్‌, బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.24 కోట్లని సీజ్‌ చేశారు. జూదం ఆడుతున్న స్థలం పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యుడు జగదీశ్వర్ రెడ్డికి చెందిన స్థిరాస్తి వ్యాపార కార్యాలయంగా పోలీసులు గుర్తించారు.

SOT Raids on Gambling Camp in Hyderabad: ఈ ఘటన స్థలంలో పీర్జాదీగూడ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, ఓ కార్పొరేటర్, ఆరుగురు కార్పొరేటర్ల భర్తలు, కొందరు బిల్డర్లు ఉన్నట్లు తెలిసింది. ఎస్‌ఓటీ దాడుల సమాచారం బయటకు పొక్కడంతో మేడిపల్లి పోలీసులు, స్థానిక నేతల అనుచరులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. సోదాలు చేసిన కార్యాలయంలోకి పోలీసులు మీడియాను అనుమతించలేదు.

ప్రజా ప్రతినిధులను లోపలే ఉంచి విద్ద్యుద్దీపాలు ఆపేశారు. ఇంతలోనే నేతల అనుచరులు మీడియా ప్రతినిధులపై దాడిచేసి చరవాణికు లాక్కున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మీడియా ప్రతినిధులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Jan 30, 2023, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.