ETV Bharat / crime

Drugs Seized in Hyderabad: భారీగా డ్రగ్స్ పట్టివేత... ట్యాబ్లెట్ల రూపంలో.. ఫొటో ఫ్రేమ్స్​లో...

author img

By

Published : Nov 11, 2021, 4:00 PM IST

Updated : Nov 11, 2021, 5:49 PM IST

14.2 కిలోల సూడో ఎపిడ్రిన్‌ను (మత్తు మాత్రలు) (Drugs Seized in Hyderabad) స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్​ సీపీ అంజినీకుమార్​ వెల్లడించారు. ఫొటో ఫ్రేమ్స్​లో పెట్టి ప్యాకింగ్​ చేసి, ఆస్ట్రేలియా పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగా దాడులు చేసినట్లు తెలిపారు.

Drugs Seized in Hyderabad
Drugs Seized in Hyderabad

Drugs Seized in Hyderabad: భారీగా డ్రగ్స్ పట్టివేత... ట్యాబ్లెట్ల రూపంలో.. ఫొటో ఫ్రేమ్స్​లో...

హైదరాబాద్​లో భారీ స్థాయిలో మాదవద్రవ్యాలను (drugs seized in hyderabad) పోలీసులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు డ్రగ్స్‌ను (drugs seized in hyderabad) స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసులకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌(Hyderabad CP Anjani Kumar) మీడియాకు వెల్లడించారు.

హైదరాబాద్​లోని నార్త్‌ జోన్‌ పరిధిలో దాదాపు 14.2 కిలోల నిషేధిత సూడో ఎపిడ్రిన్‌(pseudoephedrine)ను బేగంపేట పోలీసులు(Begumpet police) స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.5.50 కోట్లు(Rs 5.5 crore drugs seized) ఉంటుందని అంచనా. ఇండియన్‌ మార్కెట్‌లో దీని విలువ కిలోకి రూ. 40 లక్షలు ఉంటుంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(DRI Report) ఇచ్చిన సమాచారం మేరకు బేగంపేట(Begumpet police)లోని ఇంటర్‌నేషనల్‌ కొరియర్‌ ఏజెన్సీలో తనిఖీలు చేశాం. అనుమానం రాకుండా ఫొటో ఫ్రేమ్స్‌(photo frames were seized)లో పెట్టి ప్యాకింగ్‌ చేసి ఆస్ట్రేలియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. డీఆర్‌ఐ నుంచి వచ్చిన సమాచారం మేరకు కొరియర్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్న 22 ఫొటో ఫ్రేమ్స్‌(22 photo frames were seized)ను గుర్తించి స్వాధీనం చేసుకున్నాం. కొరియర్‌ చేసేందుకుగాను నకిలీ ఆధార్‌ను ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు దీంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నాం. తదుపరి దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలిస్తాయి... అని సీపీ వివరించారు.

మత్తు మాత్రల విక్రయం.. ముగ్గురి అరెస్టు..

నగరంలో మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముగ్గురిని ఆసిఫ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 110 ఎండీఎంఏ టాబ్లెట్స్‌(police seized 110 MDMA pills)ను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా మత్తు మాత్రలు విక్రయిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సాయి చరణ్‌, రాచర్ల అంకిత్‌, అజయ్‌ సాయిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ తెలిపారు.

తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలి..

సీపీ అంజనీ కుమార్(Hyderabad CP Anjani Kumar) పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఓ విజ్ఞప్తి చేశారు. మీ పిల్లలకు ఖర్చులకు డబ్బు ఇస్తున్నారు. దాన్ని వారు ఎలా ఖర్చు చేస్తున్నారు.. ఎందుకోసం ఖర్చు చేస్తున్నారనే విషయాలను మీరు గమనించాలి. డబ్బున్న వారు, ఎగుమ మధ్యతరగతి కుటుంబాల పిల్లలను టార్గెట్‌ చేసుకొని మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండడమే కాకుండా.. పిల్లలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది... అని సీపీ సూచించారు.

ఇదీచూడండి: Marijuana cultivation at Home: ఇంటి ఆవరణలో గంజాయి సాగు.. నిందితులను పట్టిస్తున్న గాంజా కంపు

Last Updated : Nov 11, 2021, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.