ETV Bharat / crime

Father rapes daugther: దారుణం.. ఐదేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం!

author img

By

Published : Apr 25, 2022, 4:17 PM IST

Father rapes daughter: బాసటగా నిలవాల్సినవాడే బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేశాడు. మానవ మృగాల నుంచి రక్షించాల్సినవాడే రాక్షసుడిగా మారాడు.. కన్న బిడ్డను కాపాడాల్సిన వాడే కాలసర్పంగా మారాడు.. వావివరుసలు మరిచి కన్న కూతురినే కాటేశాడు. అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో చోటుచేసుకుంది.

దారుణం.. ఐదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం!
దారుణం.. ఐదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం!

Father rapes daughter: ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రే తన ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొప్పూడి గ్రామానికి చెందిన నూర్ భాషా ఆదం షఫీకి 2016లో నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెేనికి చెందిన హుస్సేన్ బీతో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. పాపకు ఐదేళ్లు. ఆదం షఫీ బొప్పూడిలో ఉంటూ.. చిలకలూరిపేటలోని కళామందిర్ సెంటర్ వద్ద ఉన్న తిను బండారాల దుకాణంలో పని చేస్తున్నాడు. కుమార్తె ఓ పాఠశాలలో చదువుకుంటోంది. స్కూల్​కు వెళ్లే సమయంలో చిన్నారికి తల్లి స్నానం చేసేటప్పుడు తనకి నొప్పిగా ఉంటుందని.. రాత్రిపూట నాన్న పక్కన పడుకోపెట్టవద్దని ఏడుస్తూ చెప్పింది. సరేనంటూ తల్లి ఓదార్చింది. (ప్రతిరోజు రాత్రి సమయంలో కుమారుడు తల్లి పక్కన, కూతురు తండ్రి పక్కన నిద్రపోతుంటారు.)

చిన్నారి చెప్పిన విషయంతో తల్లి హుస్సేన్ బీ ఆలోచనలో పడింది. భర్త ఇలాంటి దుర్మార్గానికి పాల్పడతాడా..? అనే సందేహం వచ్చింది. గత వారం రోజులుగా పలుమార్లు కూతురు చెప్పిన విషయాన్నే చెప్పడంతో భర్తను అనుమానించింది. ఆదివారం రాత్రి భోజనం చేసి నలుగురు పడుకున్నారు. అంతలోనే భర్త తను బయటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి.. 11 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో హుస్సేన్ బీ నిద్రపోతున్నట్లు నటిస్తూ.. భర్త చేసే పనులు గమనించింది. భార్య నిద్ర పోతుందా లేదా..? అని సెల్​ఫోన్ లైట్ వేసి చూశాడు. నిద్రపోతోందని గుర్తించి వెంటనే దారుణానికి సిద్ధమయ్యాడు.

కుమార్తె పక్కన పడుకుని సెల్​ఫోన్​ ఆన్ చేశాడు. అందులో నీలిచిత్రాలు చూస్తూ తన నిద్రిస్తున్న కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గమనించిన భార్య హుస్సేన్ బీ వెంటనే భర్తను పట్టుకుంది. ఇంత దారుణానికి ఒడిగట్టిన తన భర్తలాంటి దుర్మార్గులు భూమి మీద ఉండకూడదని రోదించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇలాంటి దారుణ సంఘటనలు మరొకరికి జరగకుండా తన భర్తలాంటి కసాయి వ్యక్తులను భూమి మీద లేకుండా చేయాలని కోరింది. పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంది.


ఇవీ చూడండి..

దంపతుల మధ్య ఘర్షణ.. పసికందును ఇటుక బట్టీకేసి కొట్టి చంపిన తండ్రి

16 ఏళ్ల లోపు పిల్లల్లో అంతుచిక్కని కాలేయ వ్యాధి.. ఓ చిన్నారి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.