ETV Bharat / crime

దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ వ్యవహారం.. నిందితుడి అరెస్ట్

author img

By

Published : Nov 30, 2022, 4:32 PM IST

Investment Fraud In Hyderabad: దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ వ్యవహారం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

Bottu billalu and lamp wicks scam updates
Bottu billalu and lamp wicks scam updates

Investment Fraud In Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలో దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ యంత్రాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలో పట్టుకున్నట్లు వెల్లడించారు. దీపం వత్తుల యంత్రాలు, బొట్టు బిళ్లల యంత్రాలు కొనుగోలు చేస్తే ముడిసరుకు తామే ఇస్తామని.. తయారు చేసిన వాటిని అధిక ధరకు కొనుగోలు చేస్తామని బాధితులకు తెలిపాడు.

మొదట కొన్ని రోజులు డబ్బు చెల్లించిన అనంతరం, స్పందించకపోవడంతో.. రెండు రోజుల క్రితం బాధితులు సంస్థ కార్యాలయానికి చేరుకుని నిలదీశారు. దీంతో రమేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. మోసం పోయామని గ్రహించిన బాధితులు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నారు.

అసలేం జరిగిదంటే: హైదరాబాద్‌ ఏఎస్. రావునగర్‌లో ఆర్​ఆర్. ఎంటర్‌ప్రైజెస్ పేరుతో రావులకొల్లు రమేశ్ అనే వ్యక్తి ఓ కార్యాలయాన్ని తెరిచాడు. ఇంటి వద్దనే ఉండి, నెలకు 30 వేలు సంపాదించే అవకాశమంటూ.. యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చాడు. వీటిని చూసిన పలువురు ఆయనని సంప్రదించారు. ఇలా తన వద్దకొచ్చిన వారికి.. తమ వద్ద దీపం ఒత్తులు తయారు చేసే యంత్రం, బొట్టుబిళ్లల యంత్రం తీసుకుంటే.. ముడి సరుకును తామే ఇచ్చి, తయారు చేసిన వాటిని కొంటామని నమ్మబలికాడు.

మూడేళ్ల పాటు ఒప్పందం: గతంలో తాను ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యానని చెప్పటంతో నమ్మి, సంప్రదించిన వారంతా వరుసగా యంత్రాలు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇలా రూ. 2లక్షల 80వేలకు బొట్టుబిళ్లల తయారి యంత్రం, లక్షా 80వేలకు దీపం వత్తుల తయారుచేసే యంత్రాన్ని విక్రయించాడు. యంత్రాలు కొన్నవారితో మూడేళ్ల పాటు ఒప్పందం చేసుకున్న రమేశ్.. రూ. 250కు కిలో దూదిని కస్టమర్లకు అమ్మి.. వారి నుంచి కిలో ఒత్తులను 550కి కొంటున్నాడు.

బొట్టుబిళ్లల ముడి సరుకును రూ.2వేలకు ఇచ్చి, తయారు చేసిన వాటిని రూ. 2,600కు కొంటానని ఒప్పందం చేసుకున్నాడు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుమారు 1400 మంది ఈ యంత్రాలను కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కో ధరకు యంత్రాలు విక్రయించటం, మరికొందరికి ఈఎమ్​ఐ పద్ధతిలో విక్రయాలు.. మరికొంత మందిని చేర్పించిన వారికి కమీషన్లు ఇస్తూ వచ్చాడు.ఇలా.. 2021 నుంచి ఇప్పటి వరకూ దీపం ఒత్తుల యంత్రాలు 842 మంది, బొట్టు బిళ్లల యంత్రాలు 600 మంది కొనుగోలు చేశారు.

మొదట రెండు మూడు నెలల పాటు ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించిన రమేశ్​.. తరువాత చెల్లింపులు వాయిదా వేస్తూ వచ్చాడు. ప్రారంభంలో ఇంటికి వచ్చి తయారైన సరుకును తీసుకెళ్లగా.. రాను రానూ కస్టమర్లే కార్యాలయానికి వచ్చి సరుకును అందించాల్సి వచ్చేది. కొద్ది రోజులుగా కస్టమర్లు తయారు చేసిన సరుకును తీసుకోకపోగా, డబ్బులూ ఇవ్వకపోవటంతో వారంతా రమేశ్‌ను నిలదీశారు. కొందరు యంత్రాలను తిరిగి ఇచ్చి, డబ్బులు ఇవ్వమన్నారు. దీంతో నిర్వాహకుడు రమేశ్ బిచానా ఎత్తేశాడు.

ఇవీ చదవండి: బొట్టుబిళ్లల పేరుతో పంగనామాలు.. లబోదిబోమంటున్న బాధితులు..

డ్రగ్స్​ ముఠాలపై పోలీసుల పంజా.. పలువురు అరెస్టు

పక్కింటి పెంపుడు శునకంపై దారుణం.. కాళ్లు కట్టేసి అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.