ETV Bharat / crime

ఇద్దరు పిల్లలను బావిలో తోసి.. తండ్రి ఆత్మహత్య

author img

By

Published : Feb 4, 2023, 11:06 AM IST

Updated : Feb 4, 2023, 4:52 PM IST

man throws kids into a well in jagtial
man throws kids into a well in jagtial

11:04 February 04

ఇద్దరు పిల్లలను బావిలో తోసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

A father commits
A father commits

man throws kids into a well in jagtial : జగిత్యాల గ్రామీణ మండలం నర్సింగాపూర్​లో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన జలపతిరెడ్డికి భార్య, ముగ్గురు ఆడపిల్లలున్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో శుభకార్యానికి వెళ్తున్నామని.. కుమార్తెలు ప్రణీత, మధుమితను తీసుకుని వెళ్లాడు జలపతిరెడ్డి. కానీ, తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్‌ చేస్తే కనీసం స్పందించకపోవడంతో జలపతిరెడ్డి భార్య ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ ఉదయం గ్రామశివారులోని వ్యవసాయ పొలం వద్ద విగతజీవిగా పడి ఉన్న జలపతిరెడ్డిని స్థానికులు గుర్తించారు. అక్కడ జలపతిరెడ్డి మృతదేహం మాత్రమే ఉండగా ఇద్దరు చిన్నారుల ఆచూకీ లభించలేదు. రంగంలోకి దిగిన పోలీసులు.. గ్రామస్థుల సహకారంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. అనుమానంతో పక్కనే ఉన్న బావిలోకి దిగి గాలించారు. బావిలోని నీటిని ఖాళీ చేయటంతో అందులో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఓ కేసు విషయంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము రాకుండా.. ఓ న్యాయవాది వేధిస్తున్నారని జలపతిరెడ్డి భార్య కవిత ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐతే చాల మంది అతనికి రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవటంతో మనస్థాపానికి గురయ్యాడని చేతిలో చిల్లగవ్వలేక ఇబ్బందిపడటంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. మృతుడు జలపతిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతుని భార్య మాత్రం.. తన భర్త, పిల్లలను ఎవరో చంపి బావిలో వేశారని ఆరోపిస్తోంది.

ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఇద్దరు పిల్లలను బావిలో వేసి చనిపోవడం విషాదకరం. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వారికి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాం. ఆయనకు రావల్సిన డబ్బులు వెంటనే ఇప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి- అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, స్థానికుడు

Last Updated : Feb 4, 2023, 4:52 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.