ETV Bharat / city

భగీరథ పైప్​లైన్​ లీకేజీ.. విద్యుత్ ఉపకేంద్రంలోకి చేరిన నీరు

author img

By

Published : Jan 31, 2021, 12:39 PM IST

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో మిషన్ భగీరథ పైప్​లైన్ లీకేజీకి గురై నీరంతా వృథాగా పోయింది. రహదారులు జలమయమవ్వడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

mission-bhagiratha-pile-line-leakage-at-indalwai-in-nizamabad-district
భగీరథ పైపులైన్​ లీకేజీ

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం ముఖద్వారం వద్ద మిషన్ భగీరథ పైప్​లైన్ లీకై నీరు వృథాగా పోయింది. పక్కనే ఉన్న విద్యుత్ ఉపకేంద్రంలోకిని భారీగా నీరు చేరింది. గ్రామానికి వెళ్లే రహదారి జలమయమై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భగీరథ పైప్​లైన్​ లీకేజీ

అధికారుల నిర్లక్ష్యంతో తరచూ భగీరథ పైపులైన్ లీకేజీకి గురై వేల లీటర్ల నీరు వృధాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కొన్ని గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో నీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి పైప్​లైన్​కు మరమ్మతు చేయించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.