ETV Bharat / city

మాకేమైనా జరిగితే ఏ సీఎం సమాధానమిస్తారు?: యువతులు

author img

By

Published : Mar 26, 2020, 12:18 PM IST

Updated : Mar 26, 2020, 12:34 PM IST

ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో నిలిచిపోయిన వందల మంది ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. పోలీసులు ఎటూ తేల్చకుండా గంటల తరబడి రోడ్లపైనే నిలిపేస్తున్నారు. తమకు ఏమైనా జరిగితే ఏ ముఖ్యమంత్రి సమాధానమిస్తారని.. కేసీఆర్​, జగన్​లలో ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నిస్తూ కొంత మంది యువతులు ఆవేదన వ్యక్తం చేశారు.

many passengers gathered at sagar chack post at nalgonda
'తమకు ఏమైనా జరిగితే ఏ ముఖ్యమంత్రి సమాధానమిస్తారు'

తెలంగాణ నుంచి ఆంధ్రాకు పయనమైన వారు నల్గొండ జిల్లా సాగర్​ చెక్​పోస్ట్​ వద్ద నిలిచిపోయారు. ఏపీలోకి వచ్చేందుకు ఆ రాష్ట్ర పోలీసులు అనుమతివ్వకపోవడం.. అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లాలని తెలంగాణ పోలీసులు చెప్పడం వల్ల ఏం చేయాలో తోచని స్థితిలో రోడ్లపైన, చెట్ల కింద బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

హైదరాబాద్​లో పోలీసుల నుంచి అనుమతి పత్రాలు తీసుకుని పయనమయ్యామని.. కానీ ఏపీ పోలీసులు స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రయాణికులు వాపోయారు.

గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోయాం. తమకు ఏమైనా జరిగితే దానికి ఏ ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారు: యువతుల ఆవేదన

ప్రయాణికుల ఇబ్బందులు గమనించిన పోలీసులు సమీపంలోనే ఓ టిఫిన్​ సెంటర్​కు అనుమతిచ్చారు. ఇరు రాష్ట్రాల పోలీసుల వైఖరితో వందల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు వందల మంది ప్రయాణికులకు నచ్చజెప్పేందుకు పోలీసులు శ్రమపడాల్సి వస్తోంది.

'తమకు ఏమైనా జరిగితే ఏ ముఖ్యమంత్రి సమాధానమిస్తారు'

ఇవీచూడండి: ఆంధ్రులే.. ఎన్​ఓసీ కూడా ఉంది.. కానీ ఏపీ​లోకి నో ఎంట్రీ

Last Updated : Mar 26, 2020, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.