ETV Bharat / city

సోషల్ మీడియా వాడుతున్న మహిళలు అప్రమత్తంగా ఉండాలి.. ఎందుకంటే?

author img

By

Published : Mar 8, 2022, 10:57 PM IST

Updated : Mar 9, 2022, 12:25 AM IST

Women's Day celebrations at Union Bank Of India: యూనియన్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. సైబర్ సెక్యూరిటీపై మహిళలకు అవగాహన కార్యక్రమం చేపట్టింది. సామాజిక మాధ్యమాలు వాడుతున్న మహిళలు సైబర్‌ నేరాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ఆ బ్యాంక్ ఫీల్డ్‌ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్యా సూచించారు.

Women's Day celebrations at Union Bank Of India
యూనియన్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద మహిళా దినోత్సవ వేడుకలు

Women's Day celebrations at Union Bank Of India: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యూనియన్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగ్యనగరంలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సైఫాబాద్‌ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సామాజిక మాధ్యమాలు వాడుతున్న మహిళలు సైబర్‌ నేరాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ఆ బ్యాంక్ ఫీల్డ్‌ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్యా సూచించారు.

సోషల్ మీడియా వాడుతున్న మహిళలు అప్రమత్తంగా ఉండాలి.. ఎందుకంటే?

రష్యాలో మహిళలు పోరాటం చేసిన రోజునే...

Women's Day celebrations: ఈ సందర్భంగా సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్‌, సీడాక్‌ అధికారులు సైబర్‌ సెక్యూరిటీపై మహిళలకు అవగాహన కల్పించారు. రష్యాలో మహిళల హక్కుల కోసం 1917లో పోరాటం చేసిన రోజుని అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యూనియన్ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఫీల్డ్‌ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్యా అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని యూనియన్‌ బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా ఈ సందర్భంగా దాదాపు మూడు వందల కోట్ల మేర మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. మహిళలు నిబద్ధతతో వ్యాపారలావాదేవీలు నిర్వహిస్తారని కొనియాడిన భట్టాచార్య... వారికి ఆర్థిక సాయం అందించడం తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. మహిళ దినోత్సవ కార్యక్రమంలో స్వయం సహాయక గ్రూపు మహిళలను, పలువురు మహిళా పారిశ్రామిక వేత్తలు, బ్యాంకు మహిళా ఉద్యోగులు, అధికారులను భాగస్వామ్యం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మానస్‌ రంజన్‌ బిశ్వాల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:వైభవంగా మహిళా దినోత్సవ సంబురాలు

Last Updated : Mar 9, 2022, 12:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.