ETV Bharat / city

YCP MP'S: 'తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై పార్లమెంట్​లో ప్రస్తావిస్తాం'

author img

By

Published : Jul 15, 2021, 5:41 PM IST

పార్లమెంటులో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు.. సీఎం జగన్​ దిశానిర్దేశం చేసినట్లు.. వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వెల్లడించారు. పార్లమెంటులో పోలవరం నిధుల అంశాన్ని లేవనెత్తుతామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు.. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిల అంశాలపై.. పార్లమెంటులో ప్రస్తావిస్తామని తెలిపారు.

YCP MP'S
YCP MP'S

త్వరలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైకాపా ఎంపీలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా పోలవరం నిధుల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తుతామని స్పష్టం చేశారు. జాతీయ ప్రాజెక్టుల వ్యయాన్ని కేంద్రమే భరించాల్సి ఉందని.. కానీ ఏపీ ప్రభుత్వమే పోలవరం వ్యయాన్ని భరిస్తోందని విజయసాయి తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి పైసా విడుదల కాలేదన్నారు.

తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు.. తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6,112 కోట్ల విద్యుత్‌ బకాయిల అంశాలపై.. పార్లమెంటులో ప్రస్తావిస్తామని తెలిపారు. కేఆర్‌ఎంబీ పరిమితిని కేంద్రం నోటిఫై చేయాలని కోరతామన్నారు. రాష్ట్రాల మధ్య వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతామని విజయసాయి తెలిపారు.

"శ్రీ శైలంలో 800 అడుగులుండగానే లిఫ్టుకు అనుమతించాలని కోరతాం. తెలంగాణలో 800 అడుగుల్లోపు 50 టీఎంసీలతో 5 ప్రాజెక్టులు చేపట్టారు. ఏపీలోనూ 800 అడుగులకే ఎత్తిపోతలకు అనుమతించాలని కోరతాం. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ నిబంధనలు ఉల్లంఘిస్తోంది."

- ఎంపీ విజయసాయి రెడ్డి

దిశ చట్టాన్ని వెంటనే ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని ఎంపీ విజయసాయి తెలిపారు. ఉపాధి హామీలో రూ.6,750 కోట్ల బకాయిలపై పోరాడతామని స్పష్టం చేశారు. జల వివాదంపై కేంద్ర సమక్షంలో ఇరురాష్ట్రాల సీఎంల చర్చలకు యత్నాలు జరుగుతున్నాయన్నారు. రఘురామపై సీఎం స్థాయి భేటీలో చర్చించాల్సిన అవసరం లేదని విజయసాయి అన్నారు.

YCP MP'S: 'తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై పార్లమెంట్​లో ప్రస్తావిస్తాం'

ఇదీచూడండి: నీటి పంచాయితీకి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణం: మంత్రి జగదీశ్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.