ETV Bharat / city

Vinayaka Chavithi: విదేశాల్లో వినాయకచవితి వేడుకలు

author img

By

Published : Sep 11, 2021, 2:20 PM IST

దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో స్థిరపడిన భారతీయులు కూడా వినాయక చవితి వేడుకలను వైభవంగా జరుపుతున్నారు. సాధారణంగా వారాంతంలో కలుసుకునే వీరు.. ఒకరోజు ముందే ఒకచోట చేరి.. చవితి వేడుకల్లో పాల్గొన్నారు.

Vinayaka Chavithi
వినాయకచవితి వేడుకలు

గణేశ్​ మహోత్సవ్-2021 పేరుతో బెల్జియం రాజధాని బ్రెసెల్స్​లో భారతీయులు వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానికంగా ఉన్న భారతీయుల సంఘం సీజన్స్ అండ్ అకేషన్స్ తరఫున... సాగర్ సింగంశెట్టి ఈ వేడుకలను ఏర్పాటు చేశారు.

బ్రెసెల్స్​లోని తెలుగువారు ఈ వేడుకలకు హాజరయ్యారు. స్థానికంగా ఉన్న పతంగి రాజశ్రీ మట్టి, నేచురల్ కలర్స్​తో తయారు చేసిన 3 అడుగుల గణేశ్​ విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. గణపతి కోసం 15 కిలోల లడ్డూను కూడా సిద్ధం చేశారు. బ్రసెల్స్​లో ఇలా చవితి వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారని నిర్వాహకులు వెల్లడించారు.

నిబంధనల నడుమ..

కొవిడ్ నిబంధనల నడుమ... అందరూ ఒకేసారి కాకుండా టైమ్ స్లాట్ బుకింగ్ విధానంలో వచ్చి వినాయకుడికి పూజలు నిర్వహిస్తున్నారు. పూజలే కాకుండా యువకులు, చిన్నారుల కోసం ఆటపాటలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వినాయకచవితి వేడుకలు

ఇదీ చూడండి: LORD GANESHA: అష్టదిక్కులలో వ్యాపించిన శిష్టజన రక్షకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.