ETV Bharat / city

మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో ఛార్జ్​ షీట్‌ దాఖలు

author img

By

Published : Oct 12, 2022, 12:08 PM IST

The police have filed a criminal charge sheet former CI Nageshwar Rao : మాజీ సీఐ నాగేశ్వరరావు అత్యాచార చేశారని మహిళ జూలై 7వ తేదీన పోలీస్​ స్టేషన్​ ఫిర్యాదు చేసింది. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, జైలుకి పంపారు. విచారణ చేపట్టిన పోలీసులు 600 పేజీలతో కూడిన నేరాభియోగపత్రం సిద్ధం చేశారు.

former CI Nageshwar Rao
మాజీ సీఐ నాగేశ్వరరావు

TS police have filed a criminal charge sheet former CI Nageshwar Rao : వనస్థలిపురం పోలీసులు మాజీ సీఐ నాగేశ్వర్ రావు కేసులో నేరాభియోగపత్రం దాఖలు చేశారు. 600 పేజీలతో కూడిన నేరాభియోగపత్రంలో 75 మంది సాక్ష్యులను చేర్చారు. వీటిని ఎల్బీ నగర్ కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. మాజీ సీఐ నాగేశ్వర్​రావు నేరం చేశారనడానికి తగిన ఆధారాలను పొందుపర్చారు. జూలై 7వ తేదీన వనస్థలిపురం పీఎస్ లో నాగేశ్వర్ రావుపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు... అపహరించారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూలై11వ తేదీన నాగేశ్వర్​రావును అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్​కు తరలించారు. ఆ తర్వాత 18వ తేదీన కస్టడీలోకి తీసుకొని 5రోజుల పాటు విచారించారు. నాగేశ్వర్​రావు అత్యాచారం చేశారనడానికి తగిన ఆధారాలు సేకరించారు. మహిళ లోదస్తుల్లో నమూనాలు సేకరించి, నాగేశ్వర్ రావు డీఎన్ఏతో సరిపోల్చారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఈ రెండు సరిపోలాయి.

సీసీ కెమెరా దృశ్యాలను సైతం పరిశీలించారు. నాగేశ్వర్ రావు సెల్​ఫోన్​ను విశ్లేషించి... అత్యాచారం జరిగిన సమయంలో మహిళ ఇంట్లోనే ఉన్నట్లు తేల్చారు. మహిళ నివాసం ఉండే ఇంటి కాపలాదారుతో పాటు... చుట్టుపక్కల వాళ్ల సాక్ష్యాలను నమోదు చేశారు. వీటన్నింటిని నేరాభియోగపత్రంలో పొందుపర్చారు. ఈ కేసు విచారణ ఎల్బీ నగర్ కోర్టులో కొనసాగుతోంది. నాగేశ్వర్​రావు హైకోర్టులో బెయిల్ తీసుకొని చర్లపల్లి జైలు నుంచి బయటికి వచ్చారు. అత్యాచార ఆరోపణలు రావడంతో నాగేశ్వర్​రావును హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విధుల నుంచి తొలిగించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.