ETV Bharat / city

HC on Corona: జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి: హైకోర్టు

author img

By

Published : Aug 11, 2021, 3:55 PM IST

Updated : Aug 11, 2021, 4:41 PM IST

telangana-high-court-hearing-on-corona-situation-in-state
telangana-high-court-hearing-on-corona-situation-in-state

15:51 August 11

కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రణాళికను రూపొందించాలి: హైకోర్టు

వినాయక చవితి, ఇతర పండుగల సందర్భంగా జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉత్సవాల్లో అనవసరంగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు... ఆంక్షలు, మార్గదర్శకాలను వీలైనంత ముందుగానే ప్రజలకు తెలియజేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు కచ్చితమైన ప్రణాళికను రూపొందించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. గత కొన్ని రోజులుగా పాజిటివిటీ రేటు, చికిత్సల ఆధారంగా నిర్దుష్టమైన రోడ్​మ్యాప్ తయారు చేయాలని పేర్కొంది. సీరో సర్వైలెన్స్ వివరాలు, కరోనాపై ఏర్పాటైన కమిటీ సమావేశంపై నివేదికలు సమర్పించాలని ప్రజారోగ్య విభాగం డైరెక్టర్​ను ధర్మాసనం ఆదేశించింది. పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 8కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:

Ganesh immersion: నిమజ్జనంపై నిర్ణయానికి వారం సమయం కోరిన ప్రభుత్వం

Last Updated : Aug 11, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.