ETV Bharat / city

RGV ON MAA Elections: ‘మా’పై రాంగోపాల్‌ వర్మ సెటైర్‌

author img

By

Published : Oct 17, 2021, 4:09 PM IST

‘మా’లో జరుగుతోన్న తాజా పరిణామాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి.

rgv tweet on maa
rgv tweet on maa

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’లో సమస్యలున్నాయంటూ ప్రకాశ్‌రాజ్ విమర్శలు చేసినప్పటి నుంచి ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ నటీనటుల మధ్య జరిగిన మాటల దాడులు సాధారణ రాజకీయాలను తలపించిన విషయం తెలిసిందే. లోకల్‌, నాన్‌లోకల్‌ అనే అంశం నుంచి ప్రారంభమై.. వ్యక్తిగత ఆరోపణలు, సినిమా బడ్జెట్లు, అవార్డులంటూ ఒకరిపై ఒకరు కీలక ఆరోపణలు చేసుకున్నారు. మరోవైపు, శనివారం జరిగిన అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలోనూ పలువురు నటులు ప్రత్యర్థి ప్యానెల్‌, వారి మద్దతుదారులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే ‘మా’లో జరుగుతోన్న తాజా పరిణామాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ‘మా’లోని మొత్తం వ్యవహారం చూస్తుంటే సర్కస్‌ని తలపించేలా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి.

  • Cine”MAA”people proved to the audience, that they are actually a CIRCUS 😳😳😳😳

    — Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: విష్ణు ట్వీట్​లో పవన్​ వీడియో​.. ఫ్యాన్స్​లో చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.