ETV Bharat / city

నేటి నుంచి అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం

author img

By

Published : Oct 28, 2020, 6:34 PM IST

Updated : Oct 29, 2020, 3:08 AM IST

నేటి నుంచి అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం
నేటి నుంచి అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం

18:32 October 28

నేటి నుంచి అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం-2020 అమలు తేదీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 29 నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

భూ సంబంధిత లావాదేవీలు పూర్తి పారదర్శకంగా జరిగేలా... ధరణి పోర్టల్ ద్వారా కోర్ బ్యాంకింగ్ విధానం తరహాలో జరగనున్నాయి. ఇందుకోసం ధరణి పోర్టల్​ను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఇప్పటికే అధికారులు, సిబ్బందికి వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు పోర్టల్​లో వేర్వేరుగా చోటు కల్పించారు. 

కొత్త రిజిస్ట్రేషన్లు, వారసత్వ బదిలీలు, తదితర లావాదేవీలన్నీ ఇక నుంచి ధరణి ద్వారానే జరగనున్నాయి. పోర్టల్​లో భూములు, ఆస్తుల సమాచారం, నిషేధిత జాబితాలోని భూములు, ఎన్​ కంబరెన్స్ సహా స్టాంపు డ్యూటీ నిర్ధరణ కోసం భూముల వారీగా మార్కెట్ విలువను పొందుపరిచారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పోర్టల్ ద్వారానే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: అధిక వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్‌

Last Updated : Oct 29, 2020, 3:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.