ETV Bharat / city

'రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్​ పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముంది?'

author img

By

Published : Mar 11, 2022, 3:50 PM IST

MLA Rajagopal Reddy on PCC Chief: తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పదవి ఇస్తే ఎలా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని... నిజమైన కాంగ్రెస్ వాదులకు పదవి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అప్పుడే పార్టీ బాగుపడుతుందని అన్నారు. లేదంటే కాంగ్రెస్ నష్ట పోతుందని హెచ్చరించారు.

MLA Rajagopal reddy
MLA Rajagopal reddy

MLA Rajagopal Reddy on PCC Chief: కాంగ్రెస్​లో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ నుంచి వచ్చిన వారికి అధ్యక్ష పదవి ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. అధిష్ఠానం తప్పుడు నిర్ణయం తీసుకుంది కాబట్టే తాము సైలెంట్​గా ఉన్నామని తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడింది తామని... కొత్తగా వచ్చినవారికి పదవులు ఇస్తే.. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న తమ పరిస్థితి ఏంటని నిలదీశారు. సీఎల్పీ కార్యాలయంలో రాజగోపాల్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు.

ఇప్పటికైనా మించిపోయింది లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నిజమైన కాంగ్రెస్ వాదులకు పదవి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అప్పుడే పార్టీ బాగుపడుతుందని... తెలంగాణలో బతికి బట్ట కడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేదంటే కాంగ్రెస్ నష్ట పోతుందని స్పష్టం చేశారు. అధ్యక్ష పదవి విషయంలో హైకమాండ్ ముందు నిర్ణయం తీసుకుని... తర్వాత ఏదో అభిప్రాయం తీసుకున్నట్లు యాక్ట్ చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్​ పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎల్లయ్య మల్లయ్య అభిప్రాయం తీసుకుని అధ్యక్షుని నియమిస్తారా అని అన్నారు.

ఇదీ చదవండి : 'హలో తమ్ముడూ'.. అంటూ రేవంత్‌కు జగ్గారెడ్డి పలకరింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.