ETV Bharat / city

KTR On Cantonment Roads: కంటోన్మెంట్​ను జీహెచ్​ఎంసీలో కలపాలని మంత్రి కేటీఆర్​ ప్రతిపాదన

author img

By

Published : Dec 18, 2021, 9:10 PM IST

KTR On Cantonment Roads: సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ రోడ్ల మూసివేతపై మంత్రి కేటీఆర్​ స్పందించారు. అక్రమంగా రోడ్లు మూసివేయటాన్ని ఖండిస్తూ.. కేంద్రమంత్రులకు ట్వీట్​ చేశారు. కనీస వసతులు కల్పించకపోతే.. కంటోన్మెంట్​ను జీహెచ్​ఎంసీలో విలీనం చేయాలని మంత్రి ప్రతిపాదించారు.

minister ktr tweet on Cantonment Roads illegal blocking in secundrabad
minister ktr tweet on Cantonment Roads illegal blocking in secundrabad

KTR On Cantonment Roads: ప్రజలకు కనీస వసతులు కల్పించలేకపోతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​లో విలీనం చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. కంటోన్మెంట్​లో రోడ్లను అక్రమంగా మూసివేతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోవడంలేదని కేటీఆర్​ ప్రశ్నించారు.

ktr tweet to kishan reddy: రోడ్ల మూసివేతపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్​... కేంద్ర మంత్రులు రాజ్​నాథ్ సింగ్, కిషన్ రెడ్డికి ట్వీట్ చేశారు. అక్రమంగా రోడ్ల మూసివేతపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారని ట్వీట్​లో పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్​లోని స్థానిక మిలటరీ సంస్థ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తోంటే కేంద్రం ఎందుకు నియంత్రించడం లేదన్న మంత్రి... ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.

కేవలం రెండు రోడ్లను మాత్రమే మూసివేశారంటూ లోక్​సభలో కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చేసిన ప్రకటనపైన కూడా కేటీఆర్ స్పందించారు. మొత్తం 21 రోడ్లు మూసివేస్తే.. రెండు మాత్రమే కేంద్ర దృష్టికి రావటం గమనార్హమన్నారు. 21 రోడ్లు మూసివేయటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​లో విలీనం చేసి సమస్యలు పరిష్కరించుకుందామని కేటీఆర్ ప్రతిపాదించారు.

  • Dear @rajnathsingh Ji, your junior minister are unaware of ground realities

    While 21 roads have been closed illegally & people are inconvenienced, your Govt reports only 2!

    If the SCB can’t provide basic facilities for citizens, request you to merge it with GHMC & resolve pic.twitter.com/MGWU9EMHXm

    — KTR (@KTRTRS) December 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.