ETV Bharat / city

First Night in University?: యూనివర్సిటీలో శోభనమా?... ఇదెక్కడి చోద్యం?

author img

By

Published : Aug 21, 2021, 11:05 PM IST

ఏపీలోని జేఎన్టీయూ కాకినాడ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహంలో ఓ జంట శోభనానికి ఏర్పాట్లు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఇటువంటి కార్యక్రమాలకు అతిథిగృహాన్ని.. అది కూడా చదువులకు నిలయమైన యూనివర్సిటీలోని గదులను వినియోగించడంపై విమర్శలు వస్తున్నాయి.

honey-moon-arrangements-at-jntu-kakinada-university-guest-house
honey-moon-arrangements-at-jntu-kakinada-university-guest-house

యూనివర్సిటీలో శోభనమా?... ఇదెక్కడి చోద్యం?

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహంలో.. నూతన వధూవరుల శోభనానికి జరిగన ఏర్పాట్ల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా విశ్వవిద్యాలయంలోని అతిథి గృహాన్ని.. యూనివర్సిటీకి చెందిన వారికి మాత్రమే కేటాయిస్తారు.

కానీ.. ఉమెన్ ఎంపవర్​మెంట్ డైరెక్టర్ స్వర్ణకుమారి పేరిట ఈ నెల 18 నుంచి మూడు రోజులపాటు అతిథిగృహాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. వివాహ వేడుక అనంతరం ఒక గదిలో శోభన ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇలాంటి వాటిని అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై వర్సిటీ అధికారులు విచారణ చేపట్టారు. ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.