ETV Bharat / city

మూల్యాంకనంలోనూ లోపాలే.. తెలుగు, ఆంగ్లంలో లక్షమందికి 91-100 మార్కులు

author img

By

Published : Jun 8, 2022, 8:53 AM IST

SSC results in AP : ఏపీ పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో మార్కుల వరద పారిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 600కు 598 మార్కులు ఎలా సాధ్యం? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అత్యధిక మార్కులు వస్తున్న జవాబు పత్రాలను మచ్చుకు కొన్నయినా తనిఖీ చేయడం లేదు. కొన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించినవారు మరికొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడం విశేషం. జవాబులను బట్టీ కొట్టి రాస్తే మొత్తం మార్కులు ఇచ్చేస్తున్నారు. విద్యార్థులు ఎంతవరకు అవగాహన చేసుకోగలిగారు? ఎంతవరకు సబ్జెక్టును రాశారు? అనే దానితో సంబంధం ఉండడం లేదు.

మూల్యాంకనంలోనూ లోపాలే
మూల్యాంకనంలోనూ లోపాలే

SSC results in AP : ఈ ఏడాది ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత తీసికట్టుగా ఉన్నా అత్యధికశాతం మందికి మార్కులు అదిరిపోయాయి. మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణులు కాగా పాసైనవారిలో 76.70 శాతంమంది 360కు పైగా మార్కులు సాధించిన వారే ఉన్నారు. 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించగా వారిలో 41,940 మంది 545 పైగా మార్కులు సాధించారు. 500-544 మధ్య మార్కులు సాధించినవారు 60 వేలకు పైగా ఉన్నారు. థియరీ పరీక్షల్లోనూ 99, 100 మార్కులు వేస్తున్న ఘటనలు ఉంటున్నాయి.

SSC results in AP 2022 : మూల్యాంకనంలో మార్కుల వరద పారిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 600కు 598 మార్కులు ఎలా సాధ్యం? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అత్యధిక మార్కులు వస్తున్న జవాబు పత్రాలను మచ్చుకు కొన్నయినా తనిఖీ చేయడం లేదు. కొన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించినవారు మరికొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడం విశేషం. జవాబులను బట్టీ కొట్టి రాస్తే మొత్తం మార్కులు ఇచ్చేస్తున్నారు. విద్యార్థులు ఎంతవరకు అవగాహన చేసుకోగలిగారు? ఎంతవరకు సబ్జెక్టును రాశారు? అనే దానితో సంబంధం ఉండడం లేదు.

గణితం, భౌతిక, రసాయన శాస్త్రంలాంటి వాటిల్లో లెక్కలు, ఫార్ములాలు ఉంటాయి. వాటిని సక్రమంగా రాస్తే మొత్తం మార్కులు వేసే అవకాశం ఉంటుంది. కానీ థియరీ పరీక్షల్లోనూ 99, 100 మార్కులు ఎలా సాధ్యం? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొంతమంది కొద్దిపాటి జవాబు రాసినా ఎన్నో కొన్ని మార్కులు వేసేస్తున్నారు. ఇటీవల ఒంగోలులోని రామనగర్‌లో మూల్యాంకనంలో డొల్లతనాన్ని రాష్ట్ర పరిశీలకులు గుర్తించారు. ఒక సబ్జెక్టులో కనీసం అర మార్కు కూడా రాని జవాబుకు మూడు మార్కులు వేసినట్లు గుర్తించారు. సగం జవాబు రాసిన ప్రశ్నలకు సైతం పూర్తి మార్కులు వేయడం పైనా పరిశీలకులు ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే మూల్యాంకనంలో డొల్లతనం అర్థమవుతుంది.

.

తెలుగు, ఆంగ్లంలో అత్యధికం..
ఈసారి తెలుగు, ఆంగ్ల భాషలో 91-100 మార్కులు సాధించిన వారే అత్యధికంగా ఉన్నారు. ఒక్క తెలుగులోనే 1,27,953, ఆంగ్లంలో 1,10,133 మంది 91 మార్కులకు పైనే సాధించారు. సాంఘికశాస్త్రంలో 80-90 మార్కులు సాధించిన వారు 71,088 మంది ఉన్నారు. తెలుగులో 91 పైన మార్కులు వేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో బిట్‌పేపర్‌ విధానం తొలగించారు. ఒకటి, రెండు, నాలుగు, ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఇచ్చారు. అన్నీ సమాధానాలు రాయాల్సినవే ఉన్నా ఎక్కువ మార్కులు ఎలా వస్తున్నాయనే దానిపై పునఃపరిశీలన ఉండడం లేదు. ప్రభుత్వ పరీక్షల విభాగం మూల్యాంకనానికి సబ్జెక్టులవారీగా నిబంధనలు, సూత్రీకరణలను ఇస్తుంది. దీని ఆధారంగా మార్కులు వేయాల్సి ఉండగా.. కొందరు సొంతంగానూ ఎక్కువ మార్కులు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

మూల్యాంకనంలోనూ లోపాలే
మూల్యాంకనంలోనూ లోపాలే

వైఫల్యం తల్లిదండ్రుల మీదకు నెడతారా?
‘‘పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యానికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించకుండా విద్యార్థుల తల్లిదండ్రులపై నెట్టడం ఆయన చేతగానితనాన్ని సూచిస్తోంది. కొవిడ్‌ సమయంలో విద్యాప్రమాణాలు పెంచాలని ఇతర రాష్ట్రాలు డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెడితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ చొరవ తీసుకోలేదు. అమ్మఒడి ద్వారా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే ఉత్తీర్ణత శాతాన్ని తగ్గించేందుకు ఈ ఎత్తుగడ వేసింది.’’ - ధూళిపాళ్ల నరేంద్ర, తెదేపా మాజీ ఎమ్మెల్యే

మూల్యాంకనంలోనూ లోపాలే
మూల్యాంకనంలోనూ లోపాలే

జవాబు పత్రాలను బయటపెడితే సరి
‘‘కొందరు విద్యార్థులకు 590కి పైగా మార్కులు వచ్చాయని గొప్పగా చెబుతున్నారు. నిజమైన మార్కులు తెలియాలంటే అలాంటివారి జవాబు పత్రాలను బయటపెట్టాలి. 545కు పైగా మార్కులు సాధించిన వారు గణనీయంగా పెరిగారు. మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన వారే 76.70 శాతం ఉన్నారు. పరీక్షల్లో మొదటి మూడు రోజులు జరిగిన మూడు పరీక్షల్లో చాలామంది 91%, 97%, 97% మార్కులు సాధించడం గమనార్హం. పేపర్ల లీకేజీ ఆరోపణలు, కేసుల తర్వాత చివరి మూడు రోజుల్లో ఉపాధ్యాయులు మాస్‌ కాపీయింగ్‌కు సహకారం తగ్గించడం వల్లనే ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత తగ్గింది.’’ - గుంటుపల్లి శ్రీనివాస్‌, సామాజిక కార్యకర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.