ETV Bharat / city

మీ ఫోన్​లో ఆక్సీమీటర్ యాప్ ఉందా..? అయితే జాగ్రత్త

author img

By

Published : May 26, 2021, 4:53 AM IST

కొవిడ్ మహమ్మారి ప్రంపంచాన్నే కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే సైబర్ నేరగాళ్లు మాత్రం రోజుకో ఎత్తుగడతో అమాయకులను దోచుకుంటున్నారు. ప్రజల్లో వైరస్‌ భయాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని మోసాలకు పాల్పడుతున్నారు. కొత్తగా ఆక్సీమీటర్‌ యాప్‌ పేరిట కుచ్చుటోపీ పెడుతున్నారు.

మీ ఫోన్​లో ఆక్సీమీటర్ యాప్ ఉందా..? అయితే జాగ్రత్త
Do you have an Oximeter app on your phone? Be careful though

మీ ఫోన్​లో ఆక్సీమీటర్ యాప్ ఉందా..? అయితే జాగ్రత్త

కరోనా ఎంతోమంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కొవిడ్‌ భయంతో అనేకమంది మందులు, వైద్యపరికరాలు కొని... ఇంట్లో సిద్ధంగా ఉంచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇటీవల అక్సీమీటర్ యాప్ గురించి ప్రచారం జరుగుతోంది. ఆ విషయాన్ని సైబర్‌ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.

ఫ్రింగర్ ప్రింట్స్ నుంచి..

ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోగానే మన మొబైల్‌లో పలు అనుమతులు అడుగుతుంది. ఆ తర్వాత యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఈ యాప్ ద్వారా మన ఆక్సిజన్ లెవల్‌ను తెలుసుకోవాలంటే..... మన వేలి ముద్రను కొంత సమయంపాటు.. ఫింగర్ ప్రింట్ డిటెక్టర్‌పై ఉంచాల్సి ఉంటుంది. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు మన వేలి ముద్రల డేటా చోరీ చేస్తారు. మన బ్యాంకు ఖాతాలకు, ఆధార్ కార్డుల వివరాలు... జత అయి ఉంటాయి. మన చరవాణి నుంచి చోరీ చేసిన వేలి ముద్రలతో....వాటి ద్వారా ఖాతాల్లోని నగదు ఖాళీ చేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఏజెంట్లతోనూ కుమ్మక్కై..

ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఉండటం... వాటికి ఆధార్ కార్డు వివరాలు వేలి ముద్రలుఅనుసంధానం అయి ఉండటమే సైబర్ నేరగాళ్లకు ఆసరాగా మారింది. చాలా గ్రామాల్లో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్- ఈపీఎస్​ ఏజెంట్లు ఉంటారు. కేవలం ఆధార్‌ కార్డు, వేలిముద్రల సాయంతో వారు లావాదేవీలు చేస్తారు. సైబర్ నేరగాళ్లు అలాంటి ఏజెంట్లతోనూ కుమ్మక్కై ఖాతాలోని సొత్తును కాజేస్తారని పోలీసులు చెబుతున్నారు. పలు బ్యాంకింగ్ యాప్‌ల లాగిన్ వివరాలూ చోరీకీ గురయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఒక్క ఆక్సీమీటర్ యాపే కాదు. మన వేలి ముద్రలను వేసి ఉపయోగించే తెలియని.. యాప్​లను డౌన్‌లోడ్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి: కరోనా కట్టడి పేరిట మూఢనమ్మకాల ఆచరణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.