ETV Bharat / city

Congress Protest: ధాన్యం కొలుగోలే ప్రధాన డిమాండ్​గా రేపు, ఎల్లుండి కాంగ్రెస్​ దీక్ష

author img

By

Published : Nov 26, 2021, 10:39 PM IST

నిత్యం వివిధ రకాలు కార్యక్రమాలతో రైతులకు మద్దతుగా నిలుస్తోన్న కాంగ్రెస్​(congress protest for farmers).. ధాన్యం కొనుగోలు(paddy procurement in telangana) డిమాండ్​పై రెండు రోజుల దీక్ష(congress dheeksha)కు దిగనుంది. హైదరాబాద్​లోని ఇందిరాపార్క్​లో కాంగ్రెస్​ ముఖ్యనేతలంతా కలిసి రేపు, ఎల్లుండి దీక్ష(congress protest in hyderabad) చేయనున్నారు.

congress two days dheeksha at indhirapark for paddy procurement in telangana
congress two days dheeksha at indhirapark for paddy procurement in telangana

రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు(paddy procurement in telangana) చేయాలని కాంగ్రెస్​ నిత్యం వివిధ రకాల కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తోంది. కల్లాల్లోకి కాంగ్రెస్(kallalloki congress)​ పేరుతో.. నేతలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో రైతులను కలుసుకున్నారు. రైతులకు మద్దతిస్తూ... ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మళ్లీ.. ఇప్పుడు కాంగ్రెస్​ ముఖ్య నేతలంతా కలిసి దీక్షకు దిగుతున్నారు.

రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో.. రేపు, ఎల్లుండి కాంగ్రెస్‌ పార్టీ దీక్ష(congress dheeksha at indhirapark)కు దిగుతోంది. కర్షకులకు మద్దతుగా నిలిచేందుకు కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్కు వద్ద నాయకులు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(tpcc chief revanth reddy latest news)తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, సీనియర్‌ నాయకులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు కూడా పాల్గొంటారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(tpcc chief revanth reddy latest news)తో పాటు ముఖ్య నాయకులంతా అక్కడే రాత్రి బస చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. మరుసటి రోజు 28వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. చేయనున్న ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో రైతులను తరలించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.