ETV Bharat / city

జాతీయ జెండా నినాదంతో ప్రతి పల్లెకూ వెళ్తా: వీహెచ్‌

author img

By

Published : Jan 23, 2021, 7:22 PM IST

వచ్చే ఏప్రిల్​కు జాతీయ జెండా ఆవిష్కరించి వందేళ్లు అవుతున్నందున.. ఉత్సవాలు జరపాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్‌ కోరారు. దేశభక్తి పెంపొందించేందుకు ఊరూరికి జాతీయ జెండా నినాదంతో ప్రజల్లోకి వెళ్తానని ఆయన పేర్కొన్నారు. బీసీలకు ఉన్న క్రిమిలేయర్​ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

congress senior leader v.hanumantharao at gandhi bhavan meeting
ఊరూరికి జాతీయ జెండా నినాదంతో వెళ్తా: వీహెచ్‌

ఊరూరికి జాతీయ జెండా నినాదంతో ప్రజల్లోకి వెళ్తానని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు అన్నారు. వారిలో దేశభక్తి పెంపొందించాలన్నారు. వచ్చే ఏప్రిల్​కు జాతీయ జెండా ఆవిష్కరించి వందేళ్లు అవుతున్నందున.. ఉత్సవాలు జరపాలని వీహెచ్‌ పేర్కొన్నారు. జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆక్షేపించారు.

ప్రధాని మోదీ బీసీ అయినప్పటికీ ఓబీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. బీసీలకు ఉన్న క్రిమిలేయర్​ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 27శాతం రిజర్వేషన్ ఉన్నా.. 10శాతమైనా అమలు కావడం లేదని ఆరోపించారు. పిల్లల భవిష్యత్‌ గురించి ఆలోచించాలని సీఎం కేసీఆర్​ను కోరారు.

ఇదీ చూడండి: చంచల్​గూడ జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.