ETV Bharat / city

ఎల్లుండి ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ సభ.. ఏర్పాట్లు పరిశీలించిన కేటీఆర్

author img

By

Published : Nov 26, 2020, 12:05 PM IST

Updated : Nov 26, 2020, 12:30 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస ప్రచారం ముమ్మరం చేసింది. విపక్షాల విమర్శలు, వ్యూహాలను తిప్పికొట్టి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో ఈనెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లను గురువారం.. మంత్రులు కేటీఆర్, తలసాని పరిశీలించారు.

cm kcr's meeting
ఈనెల 28న కేసీఆర్ సభ

బల్దియా పోరులో రసవత్తరంగా ప్రచారం చేస్తున్న తెరాస.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈనెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్​తో సభ నిర్వహించనుంది. విపక్షాల వ్యూహాలు తిప్పికొట్టి.. విమర్శలను ఎక్కుపెట్టి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేరుగా కేసీఆరే రంగంలోకి దిగనున్నారు.

ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ సభ ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్, తలసాని పరిశీలించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఎల్బీ స్టేడియానికి వచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాలమల్లు, కర్నె ప్రభాకర్​లు.. ఏర్పాట్లను పరిశీలించారు.

పేదల పట్ల తనకున్న నిబద్ధతను కేసీఆర్ ఇప్పటికే చాటుకున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. కొవిడ్ నిబంధనలకు లోబడి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు వస్తూంటాయి.. పోతూంటాయన్నకేటీఆర్.. పిచ్చి మాటలు- రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. తాము ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, ఎప్పుడు ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు. అరెస్టులు చేయాలా వద్దా అనేది పోలీసులు చూసుకుంటారని స్పష్టం చేశారు.

ఎల్లుండి ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ సభ
Last Updated : Nov 26, 2020, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.