ETV Bharat / business

'మా భవిష్యత్ ఏంటి?'.. ట్విట్టర్ సీఈఓకు చుక్కలు చూపిస్తున్న ఉద్యోగులు!

author img

By

Published : May 1, 2022, 10:44 AM IST

Twitter CEO Parag Agrawal: ప్రముఖ సోషల్​మీడియా నెట్​వర్క్​ ట్విట్టర్​ సీఈఓ పరాగ్​ అగర్వాల్ చుక్కలు చూపిస్తున్నారు ఆ సంస్థ ఉద్యోగులు. ఎలాన్ మస్క్​తో ఒప్పందం ప్రక్రియ పూర్తయిన అనంతరం తమ భవిష్యత్తు ఏంటో స్పష్టత ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు.

Employees grill Twitter CEO
Employees grill Twitter CEO

Twitter CEO Parag Agrawal: ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్​ మస్క్ ట్విట్టర్​ను హస్తగతం చేసుకున్న అనంతరం తమ భవిత్యత్తు ఏంటని ఆందోళన చెందుతున్నారు ఆ సంస్థ ఉద్యోగులు. ఈ విషయమై సంస్థ సీఈఓ పరాగ్​ అగర్వాల్​ స్పందించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఉద్యోగుల గురించి సంస్థ ఆలోచిస్తోందని.. అయితే ఒప్పందం పూర్తైన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించలేమన్నారు కార్యనిర్వహక సభ్యులు. శుక్రవారం టౌన్​ హాల్​లో సమావేశం జరగగా.. ఈ విషయంపై​ సీఈఓ పరాగ్​ అగర్వాల్​ సమాధానం చెప్పాలని ఉద్యోగులు డిమాండ్​ చేశారు.

ఒప్పందం ముగిసిన అనంతరం చాలా మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని.. దీనిపై సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఓ ఉద్యోగి సీఈఓ పరాగ్​ అగర్వాల్​ను సూటిగా ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అగర్వాల్​.. ఉద్యోగులు, వినియోగదారుల భవిష్యత్తు గురించి ట్విట్టర్​ శ్రద్ధ వహిస్తుందని బదులిచ్చారు. మరోవైపు ట్విట్టర్​కు కొత్త సీఈఓను నియమించేందుకు ఎలాన్ మస్క్​ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతేడాది తన ఆర్థిక చెల్లింపుల సంస్థపై దృష్టిసారించేందుకు ట్విట్టర్​ నుంచి తప్పుకున్న సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీని నియమిస్తారనే ప్రచారంలో ఉంది.

ట్విట్టర్​ను కొనుగోలు చేయడానికి ఎలాన్​ మస్క్​.. 44 బిలియన్ డాలర్లకు బిడ్​ దాఖలు చేశారు. అయితే కొత్త యాజమాన్యం వచ్చే వరకు ఉద్యోగాల కోతపై నిర్ణయాలు తీసుకోమని సీఈఓ అగర్వాల్​ గతంలోనే చెప్పారు. క్యాపిటల్​ హిల్ హింసాకాండ కథనాలను ట్విట్టర్​ సెన్సార్​ చేయడంపై మస్క్​ అసంతృప్తితో ఉన్నారు. మస్క్​ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని కొన్ని వార్తా సంస్థలు అంచనా వేశాయి.

ఇదీ చదవండి: ట్విట్టర్​ కోసం టెస్లా షేర్లను అమ్మిన మస్క్​​.. ఆందోళనలో ఇన్వెస్టర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.