ETV Bharat / business

అశ్రునయనాల మధ్య బిగ్​ బుల్​ రాకేశ్​ ఝున్​ఝున్​వాలా అంత్యక్రియలు

author img

By

Published : Aug 15, 2022, 2:38 AM IST

Updated : Aug 15, 2022, 7:13 AM IST

Rakesh Jhunjhunwala News భారత స్టాక్​ మార్కెట్​ చక్రవర్తిగా పేరుగాంచిన రాకేశ్​ ఝున్​ఝున్​వాలాకు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. ముంబయిలోని బాణ్​గంగా శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు.

Last rites of veteran investor and Akasa Air founder Rakesh Jhunjhunwala
Last rites of veteran investor and Akasa Air founder Rakesh Jhunjhunwala

Rakesh Jhunjhunwala News: దిగ్గజ వ్యాపారవేత్త, పెట్టుబడిదారు రాకేశ్​ ఝున్​ఝున్​వాలా(62) అంత్యక్రియలను ముంబయి బాణ్​గంగా శ్మశానవాటికలో నిర్వహించారు ఆయన కుటుంబసభ్యులు. బిగ్​ బిల్​ అంతిమయాత్రకు జనం భారీగా తరలివచ్చారు.

ఆకాశా ఎయిర్​ విమానయాన సంస్థకు యజమాని అయిన రాకేశ్ ఝున్​ఝున్​వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన ఆయన్ను ఉదయం 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులు.. ముంబయిలోని బీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఫోర్బ్స్​ 2021 ప్రకారం.. ఝున్​ఝున్​వాలా భారత్​లో అత్యంత ధనవంతుల జాబితాలో 36వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ దాదాపు రూ. 46 వేల కోట్లు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు గౌతమ్​ అదానీ, టాటా సన్స్​ ఛైర్మన్​ చంద్రశేఖరన్​ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన ఎందరికో ప్రేరణగా నిలిచారని ప్రశంసించారు. రాకేశ్​ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవీ చూడండి: అధిక రాబడినిచ్చే ట్రేడింగ్ వ్యూహం ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్

రాకేశ్ ఝున్​ఝున్​వాలా జీవితమే ఓ ఆర్థిక మంత్రం

Last Updated : Aug 15, 2022, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.