ETV Bharat / business

క్రెడిట్ కార్డ్​ లేకున్నా మంచి క్రెడిట్ స్కోర్​ పెంచుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 2:55 PM IST

How To Improve Credit Score Without Credit Card In Telugu : లోన్లు త్వ‌ర‌గా మంజూరు కావాల‌న్నా, కొత్త క్రెడిట్ కార్డు తీసుకోవాల‌న్నా.. ఈ రోజుల్లో మంచి క్రెడిట్​ స్కోర్​ తప్పనిసరి. అయితే చాలా మంది క్రెడిట్ కార్డుతోనే - క్రెడిట్​ స్కోర్ పెరుగుతుందని భావిస్తుంటారు. కానీ అది లేకుండానే వివిధ ప‌ద్ధ‌తుల ద్వారా క్రెడిట్ స్కోరును పెంచుకోవ‌చ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా?

Ways To Build Credit Score Without Credit Card
How to improve credit score without credit card

How To Improve Credit Score Without Credit Card : నేటి కాలంలో క్రెడిట్ స్కోరుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. లోన్ మంజూరు కావాలన్నా, కొత్త క్రెడిట్ కార్డు పొందాల‌న్నా ఈ క్రెడిట్​ స్కోరే కీల‌కం. ఈ స్కోరు బాగుంటేనే రుణాలు త్వ‌ర‌గా మంజూర‌వుతాయి. మంచి క్రెడిట్ స్కోరు మెయింటెన్ చేయాలంటే సకాలంలో రీపేమెంట్స్​ చేయ‌డం ముఖ్యం. క్రెడిట్ స్కోర్​ను ప్ర‌భావితం చేసే అంశాల్లో క్రెడిట్ కార్డ్ వినియోగం కూడా ఒక‌టి. అయితే చాలా మంది క్రెడిట్ కార్డు ఉంటేనే క్రెడిట్ లేదా సిబిల్ స్కోరు పెంచుకోవచ్చ‌ని అనుకుంటారు. కానీ క్రెడిట్​ కార్డు లేకున్నా ఈ కింద తెలిపిన 5 ప‌ద్ధతులు ఉపయోగించి మంచి క్రెడిట్​ స్కోరు సాధించ‌వచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

5 Ways To Build Credit Score Without Credit Card :

1. రుణం తీసుకోవ‌డం :
ఆర్థిక అవసరాలను తీర్చుకోవ‌డానికి మీరు బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) నుంచి లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇలా తీసుకున్న రుణాన్ని స‌కాలంలో చెల్లించ‌డం అనేది చాలా ముఖ్యం. దీని ద్వారానే మీ క్రెడిట్ స్కోర్ గణనీయంగా పెరుగుతుంది. ఇదే కాకుండా.. ఇప్ప‌టికే ఈఎంఐ చెల్లింపులుంటే వాటిని కూడా సకాలంలో చెల్లించాలి. లేక‌పోతే మీ క్రెడిట్ స్కోరుపై తీవ్రమైన ప్ర‌తికూల ప్ర‌భావం పడుతుంది.

2. సకాలంలో బిల్లుల చెల్లింపు :
దైనందిన అవసరాలు, అద్దె చెల్లింపులు, ఈఎంఐలకు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించాలి. ఇలా సకాలంలో బిల్లులు చెల్లించినప్పుడే మీ క్రెడిట్​ స్కోర్​ మంచిగా పెరుగుతుంది. అలాకాకుండా బిల్లుల చెల్లింపులో ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. మీ క్రెడిట్ స్కోర్​పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే బిల్లులను, ఈఎంఐలను నిర్ణీత గడువులోపు చెల్లించాలి. ఆన్-టైమ్ బిల్లు చెల్లింపుల రికార్డును మెయింటెన్ చేయ‌డం వ‌ల్ల మీ క్రెడిట్​ స్కోర్​ తగ్గకుండా చూసుకోవచ్చు.

3. అద్దె చెల్లింపు చరిత్ర :
ఒక‌వేళ మీరు అద్దె ఇంట్లో నివాస‌ముంటే.. దానికి సంబంధించిన అద్దె బిల్లుల చ‌రిత్ర కూడా లోన్ మంజూరులో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇలా సకాలంలో అద్దె చెల్లించేవారికి.. త్వ‌ర‌గా లోన్ మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. ఇతర చెల్లింపుల లాగానే స్థిరమైన, క్ర‌మ‌శిక్ష‌ణతో కూడిన అద్దె చెల్లింపులు.. మీరు ఒక బాధ్య‌తాయుత‌మైన రుణగ్రహీత అని నిర్ధ‌రించ‌డంలో సాయ‌ప‌డ‌తాయి.

4. స్థిర‌మైన ఉపాధి :
రుణం మంజూరు చేసే స‌మ‌యంలో స్థిర‌మైన ఆదాయం కీల‌క పాత్ర పోషిస్తుంది. అందుకే నమ్మకమైన, మంచి ఉద్యోగాన్ని కలిగి ఉండటం ముఖ్యం. ఒక‌వేళ మీకు ఇత‌ర వ్యాపారాలు, ఆదాయ మార్గాలు ఉన్నా.. ఉద్యోగం కొన‌సాగించ‌డమే బెట‌ర్‌. ఎందుకంటే బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు లాంటి రుణ‌దాత‌లు లోన్ ఇచ్చేట‌ప్పుడు.. స్థిరమైన ఉద్యోగం ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తాయి. ఎందుకంటే ఉద్యోగులకు స్థిర‌మైన ఆదాయం రావ‌డంతో పాటు, క్ర‌మతప్పకుండా చెల్లింపులు చేసే సామ‌ర్థ్యం ఉంటుంది అని బ్యాంకులు నమ్ముతాయి.

5. పీర్-టు-పీర్ లెండింగ్‌ :
పీర్-టు-పీర్ (P2P) లెండింగ్ అనేది సాంప్రదాయ బ్యాంక్ లేదా NBFC రుణాలకు ప్రత్యామ్నాయాన్నిఅందిస్తుంది. ఇది ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వ్యక్తిగత రుణదాతలతో.. రుణగ్రహీతలను కనెక్ట్ చేస్తుంది. బ్యాంకుల ద్వారా రుణం పొందడం కష్టంగా ఉన్నప్పుడు.. P2P విధానంలో రుణాన్ని పొందవచ్చు. అయితే ఇది కాస్త రిస్క్​తో కూడుకున్న వ్యవహారం అని గుర్తుంచుకోవాలి. ఇలా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలి. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ మరింత పెరుగుతుంది. చూశారుగా, ఈ విధంగా పైన పేర్కొన్న సూచ‌న‌లు పాటించ‌డం ద్వారా.. మీరు క్రెడిట్ కార్డ్‌ లేకుండానే బలమైన క్రెడిట్ స్కోర్‌ను సాధించ‌వ‌చ్చు.

రూ.10 లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే టాప్​-10 కార్స్ ఇవే!

క్రెడిట్ కార్డుతో హౌస్​​ రెంట్​ కడుతున్నారా ? ట్యాక్స్ నోటీసులు వస్తాయి జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.