ETV Bharat / business

రూ.10 లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే టాప్​-10 కార్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 1:11 PM IST

best mileage cars in India
best mileage cars under 10 lakh

Best Mileage Cars Under 10 Lakh In Telugu : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే కారు కావాలా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ.10 లక్షల బడ్జెట్లో మంచి ఫ్యూయెల్ ఎఫీషియన్సీ ఇచ్చే టాప్-బ్రాండెడ్​​ కార్స్ అందుబాటులో ఉన్నాయి. మరి వాటిపై మనమూ ఓ లుక్కేద్దామా?

Best Mileage Cars Under 10 Lakh : భారతీయులు చాలా మంది తక్కువ బడ్జెట్లో, మంచి మైలేజ్ ఇచ్చే కార్​ కొనాలని ఆశపడుతూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే.. ఫ్యూయెల్ ఎఫీషియన్సీ ఉన్న కార్లను రూపొందిస్తున్నాయి. వాటిలో టాప్​-10 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి డోమినేషన్​
తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే కార్లను రూపొందించడంలో.. భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి నంబర్ వన్​ స్థానంలో ఉందంటే.. అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మారుతి సుజుకి పెట్రోల్ ఇంజిన్ కార్లను మాత్రమే కాదు.. దాదాపు తమ అన్ని కార్లలోనూ సీఎన్​జీ పవర్​ట్రైన్ ఆప్షన్లను అందిస్తూ ఉంటుంది. కనుక మంచి బడ్జెట్​ ఫ్రెండ్లీ కారు కొనాలంటే.. మారుతి సుజుకి ఫస్ట్​ ఆప్షన్ అవుతుంది.

సూపర్​ మైలేజ్​
ARAI రేటింగ్స్ ప్రకారం, మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్​ MT లీటర్​కు 25.17 మైలేజ్​, పెట్రోల్ AMT లీటర్​కు 26.23 కి.మీ మైలేజ్ ఇస్తుంది. సీఎన్​జీ వేరియంట్ కారు 34.43km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.

భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో, మంచి మైలేజ్ ఉన్న డీజిల్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మైలేజ్ విషయంలో సీఎన్​జీ కారుతో పోల్చి చూస్తే.. ఈ డీజిల్ కారే బెస్ట్ ఆప్షన్ అని అవుతుంది.

సూపర్ మైలేజ్ ఇచ్చే టాప్​-10 కార్స్!
Top 10 Super Mileage Cars :

1. Maruti Celerio Mileage :

  • మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్ MT వేరియంట్​ 25.17 kmpl మైలేజ్ ఇస్తుంది.
  • మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్ AMT వేరియంట్ మైలేజ్​ 26.23 kmpl వరకు ఉంటుంది.
  • మారుతి సుజుకి సెలెరియో CNG వేరియంట్​ 34.43 km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.
    Maruti Celerio
    మారుతి సెలెరియో
    Maruti Celerio
    మారుతి సెలెరియో

2. Maruti WagonR Mileage :

  • మారుతి వ్యాగన్​-ఆర్​​ 1.0 పెట్రోల్​ MT వేరియంట్​ 25.17 kmpl మైలేజ్ ఇస్తుంది.
  • మారుతి వ్యాగన్​-ఆర్​​ 1.0 పెట్రోల్​ AMT వేరియంట్​ మైలేజ్​ 25.19 kmpl వరకు ఉంటుంది.
  • మారుతి వ్యాగన్​-ఆర్​​ 1.2 పెట్రోల్​ MT వేరియంట్​ 23.56 kmpl మైలేజ్ ఇస్తుంది.
  • మారుతి వ్యాగన్​-ఆర్​​ 1.2 పెట్రోల్​ AMT వేరియంట్ మైలేజ్​​ 24.43 kmpl ఉంటుంది.
  • మారుతి వ్యాగన్​-ఆర్​​ CNG వేరియంట్​ 34.05 Km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.
    Maruti WagonR
    మారుతి వ్యాగన్​-ఆర్
    Maruti WagonR
    మారుతి వ్యాగన్​-ఆర్

3. Maruti S Presso Mileage :

  • మారుతి ఎస్​-ప్రెస్సో పెట్రోల్​ MT వేరియంట్​ 24.12 kmpl మైలేజ్ ఇస్తుంది.
  • మారుతి ఎస్​-ప్రెస్సో పెట్రోల్​ AMT వేరియంట్​ మైలేజ్​ 25.3 kmpl వరకు ఉంటుంది.
  • మారుతి ఎస్​-ప్రెస్సో CNG వేరియంట్​ 32.73 km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.
    Maruti S Presso
    మారుతి ఎస్​-ప్రెస్సో
    Maruti S Presso
    మారుతి ఎస్​-ప్రెస్సో

4. Maruti Alto K10 Mileage :

  • మారుతి ఆల్టో కె10 పెట్రోల్​ MT వేరియంట్ 24.39 kmpl మైలేజ్ ఇస్తుంది.
  • మారుతి ఆల్టో కె10 పెట్రోల్​ AMT వేరియంట్ మైలేజ్​ 24.9 kmpl వరకు ఉంటుంది.
  • మారుతి ఆల్టో కె10 CNG వేరియంట్ 33.85 km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.
    Maruti Alto K10
    మారుతి ఆల్టో కె10
    Maruti Alto K10
    మారుతి ఆల్టో కె10

5. Tata Altroz Mileage :

  • టాటా ఆల్ట్రోజ్​ పెట్రోల్​ MT వేరియంట్ 19.14 kmpl మైలేజ్ ఇస్తుంది.
  • టాటా ఆల్ట్రోజ్​ పెట్రోల్​ DCT వేరియంట్ మైలేజ్ 19.33 kmpl వరకు ఉంటుంది.
  • టాటా ఆల్ట్రోజ్​ టర్బో పెట్రోల్​ MT వేరియంట్ 18.5 kmpl మైలేజ్ ఇస్తుంది.
  • టాటా ఆల్ట్రోజ్​ డీజిల్​ వేరియంట్ మైలేజ్​ 23.64 kmpl వరకు ఉంటుంది.
  • టాటా ఆల్ట్రోజ్​ CNG వేరియంట్ 26.3 km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.
    Tata Altroz
    టాటా ఆల్ట్రోజ్​
    Tata Altroz
    టాటా ఆల్ట్రోజ్​

6. Maruti Dzire Mileage :

  • మారుతి డిజైర్​ పెట్రోల్​ MT వేరియంట్​ 22.41 kmpl మైలేజ్ ఇస్తుంది.
  • మారుతి డిజైర్​ పెట్రోల్​ AMT వేరియంట్​ 22.61 మైలేజ్​ kmpl వరకు ఉంటుంది.
  • మారుతి డిజైర్​ CNG వేరియంట్​ 31.12 km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.
    Maruti Dzire
    మారుతి డిజైర్​
    Maruti Dzire
    మారుతి డిజైర్​

7. Maruti Swift Mileage :

  • మారుతి స్విఫ్ట్​ పెట్రోల్​ MT వేరియంట్​ 22.38 kmpl మైలేజ్ ఇస్తుంది.
  • మారుతి స్విఫ్ట్​ పెట్రోల్​ AMT వేరియంట్ మైలేజ్​​ 22.56 kmpl వరకు ఉంటుంది.
  • మారుతి స్విఫ్ట్​ CNG వేరియంట్​ 30.90 km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.
    Maruti Swift
    మారుతి స్విఫ్ట్​
    Maruti Swift
    మారుతి స్విఫ్ట్​

8. Maruti Baleno Mileage :

  • మారుతి బాలెనో పెట్రోల్​ MT వేరియంట్​ 22.35 kmpl మైలేజ్ ఇస్తుంది.
  • మారుతి బాలెనో పెట్రోల్​ AMT వేరియంట్ మైలేజ్​​ 22.9 kmpl వరకు ఉంటుంది.
  • మారుతి బాలెనో CNG వేరియంట్​ 30 km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.
    Maruti Baleno
    మారుతి బాలెనో
    Maruti Baleno
    మారుతి బాలెనో

9. Renault Kwid Mileage :

  • రెనాల్ట్​ క్విడ్​ పెట్రోల్​ MT వేరియంట్​ 22.3 kmpl మైలేజ్ ఇస్తుంది.
  • రెనాల్ట్​ క్విడ్​ పెట్రోల్​ AMT వేరియంట్​ మైలేజ్​ 21.46 kmpl వరకు ఉంటుంది.
    Renault Kwid
    రెనాల్ట్​ క్విడ్​
    Renault Kwid
    రెనాల్ట్​ క్విడ్​

10. Maruti Fronx Mileage :

  • మారుతి ఫ్రాంక్స్​ 1.2 పెట్రోల్​ MT వేరియంట్​ 21.79 kmpl మైలేజ్ ఇస్తుంది.
  • మారుతి ఫ్రాంక్స్​ 1.2 పెట్రోల్​ AMT వేరియంట్ మైలేజ్​ 22.89 kmpl వరకు ఉంటుంది.
  • మారుతి ఫ్రాంక్స్​ CNG వేరియంట్​ 28.51 km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.
  • మారుతి ఫ్రాంక్స్​ 1.0 పెట్రోల్​ MT వేరియంట్​ మైలేజ్​ 20.01 kmpl వరకు ఉంటుంది.
  • మారుతి ఫ్రాంక్స్​ 1.0 పెట్రోల్​ AMT వేరియంట్ ​ 21.5 kmpl మైలేజ్ ఇస్తుంది.
    Maruti Fronx
    మారుతి ఫ్రాంక్స్​
    Maruti Fronx
    మారుతి ఫ్రాంక్స్​

కొత్త బండి కొనాలా? టాప్​ -10 సూపర్ స్టైలిష్ ఎలక్ట్రిక్​ బైక్స్​ ఇవే!

మీడియం బడ్జెట్లో 6-ఎయిర్​బ్యాగ్స్ ఉన్న టాప్​-9 కార్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.