ETV Bharat / business

మరో బిగ్‌ సేల్‌కు సిద్ధమైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌.. SBI యూజర్లకు డిస్కౌంట్​ ఎంతంటే?

author img

By

Published : Jan 12, 2023, 8:15 AM IST

రిపబ్లిక్‌ డే సందర్భంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు భారీ ఆఫర్లతో సేల్‌ను ప్రారంభించనున్నాయి. మరి, ఏ సంస్థ వేటిపై ఎంతెంత ఆఫర్లు ప్రకటించాయి? సేల్స్ ఎప్పటి నుంచి ప్రారంభంకానున్నాయనే వివరాలివే.

great india amazon sale
గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌

ఈ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారీ ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ రెండు సంస్థలూ పోటాపోటీగా సేల్స్‌ ఆపర్లు ప్రకటించాయి. 'గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌' పేరిట అమెజాన్‌ సేల్‌ నిర్వహించనుండగా, 'బిగ్‌ సేవింగ్ డేస్‌' పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు రెండు సంస్థలు సేల్స్‌ వివరాలను వెల్లడించాయి.

గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌
అమెజాన్‌ సేల్‌ జనవరి 19 నుంచి జనవరి 22 వరకు కొనసాగనుంది. ఇందులో అమెజాన్‌ మొబైల్‌ ఫోన్లు, ఫోన్‌ యాక్ససరీలు, స్మార్ట్‌వాచ్‌, ల్యాప్‌టాప్‌ వంటి వాటితోపాటు ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ అందివ్వనుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లకు 10 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. గ్రేట్‌ రిపబ్లిక్ డే సేల్‌లో బడ్జెట్‌ బజార్‌, బ్లాక్‌బస్టర్ డీల్స్‌, ప్రీ-బుకింగ్‌, 8PM డీల్స్‌ కూడా ఉంటాయని అమెజాన్‌ తెలిపింది. ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లు ఒకరోజు ముందుగానే, అంటే జనవరి 18 నుంచి ఈ సేల్‌లో పాల్గొనవచ్చు. వీటితోపాటు ఒప్పో, షావోమి, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, యాపిల్‌, వివోతోపాటు మరికొన్ని మొబైల్‌ బ్రాండ్లపై భారీగా డిస్కౌంట్‌ అందివ్వనుంది.

బిగ్‌ సేవింగ్ డేస్‌
ఇక ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ జనవరి 15 నుంచి జనవరి 20 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌, హోమ్‌ అప్లయెన్సెస్‌, కిచెన్ యాక్ససరీస్‌, లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులపై ఆఫర్లు ఇస్తోంది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకంగా మైక్రోసైట్‌ను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సబ్‌స్క్రైబర్లు ఒక రోజు ముందుగా జనవరి 14 నుంచి సేల్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లకు 10 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ యూజర్లకు ఐదు శాతం, ఫ్లిప్‌కార్ట్‌ పే ద్వారా చెల్లింపులు చేసిన వారికి రూ. 1,000 విలువైన రిటర్న్‌ గిఫ్ట్‌ కార్డ్‌ను ఇస్తోంది. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 80 శాతం, గృహోపకరణాలపై 75 శాతం, దుస్తులపై 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ మైక్రోసైట్‌లో పేర్కొంది. మొబైల్‌ఫోన్లపై ఎంత డిస్కౌంట్‌ ఇస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.