ETV Bharat / business

భారత ఆర్థిక వ్యవస్థ భేష్: ఆర్​బీఐ గవర్నర్

author img

By

Published : Jul 24, 2020, 5:31 PM IST

కరోనా భయాలు, సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉన్నట్లు పేర్కొన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. అయితే రుణదాతలు నష్టభయాన్ని ఎదుర్కొనేందుకు విముఖత చూపకూడదని వెల్లడించారు. రెండేళ్లకోసారి విడుదల చేసే ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్​ఎస్​ఆర్)లో ఈ మేరకు తన అభిప్రాయాలను వెల్లడించారు గవర్నర్.

rbi
భారత ఆర్థిక వ్యవస్థ భేష్

భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని పేర్కొన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. అయితే నష్టభయాన్ని ఎదుర్కొనేందుకు రుణదాతలు విముఖంగా ఉండకూడదని పేర్కొన్నారు. రెండేళ్లకోసారి విడుదల చేసే ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్​ఎస్​ఆర్)లో ఈ మేరకు అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుత పరిస్థితుల్లో నష్టభయాన్ని ఎదుర్కొనేందుకు అనేక మార్గాలున్నాయి. అయితే నష్టభయాన్ని ఎదుర్కొనేందుకు విముఖత చూపడం అన్ని రంగాలపై ప్రతికూలత చూపుతోంది."

-శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్

వ్యాపారాలు, పెట్టుబడిదారులు, వినియోగదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఆర్థిక స్థిరత్వం ముఖ్య భూమిక పోషిస్తుందని చెప్పారు దాస్.

ప్రభుత్వ చర్యలతోనే..

ఆర్థిక రంగంపై కరోనా ప్రభావాన్ని తగ్గించడానికి ఆయా నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రతికూలతలు తగ్గినట్లు పేర్కొన్నారు శక్తికాంతదాస్. ఆర్థిక రంగానికి ఎదురయ్యే సంక్షోభ పరిస్థితులను తగ్గించేందుకు మార్కెట్ సమగ్రత సహా ఆయా వ్యవస్థలు తీసుకున్న చర్యలు తోడ్పడినట్లు వెల్లడించారు.

ప్రమాదం వాటితోనే..

ఆర్థికేతర రంగంలో పెరిగిన కార్యకలాపాలు, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు నెలకొనడం, కరోనా మహమ్మారి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ప్రమాదాలుగా పరిణమించినట్లు పేర్కొన్నారు.

సాధారణంగానే మార్కెట్లు..

ఆర్థిక, ద్రవ్య పరపతి విధానాలు, నియంత్రణ సంస్థలు తీసుకున్న చర్యలతో ఫైనాన్షియల్ మార్కెట్లు సాధారణ స్థితిలోనే కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: 2021-22లో 6.7 శాతానికి భారత వృద్ధి రేటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.