ETV Bharat / business

అప్పులే శరణ్యంగా సగం కుటుంబాల జీవనం!

author img

By

Published : Nov 4, 2020, 12:59 PM IST

కరోనా కాలంలో మధ్య తరగతి వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉద్యోగాలు పోవడం, వేతనాల్లో కోతల వల్ల ఇల్లు గడవాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ విషయాలన్ని ఓ సర్వేలో తేలాయి. సగటు మధ్య తరగతి కుటుంబాల్లో అప్పుల ధోరణిపై చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.

Increased debt trend in middle class families
మధ్య తరగతి కుటుంబాల్లో పెరిగిన అప్పుల ధోరణి

ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సంక్షోభంలో దాదాపు సగం భారతీయ కుటుంబాలు అప్పుల ద్వారానే పూట గడుపుతున్నట్లు ఓ నివేదిక తెలిపింది.

కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, వేతనాల్లో కోతలతో తక్కువ ఆదాయం కలిగిన మధ్య తరగతి వర్గాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని నివేదిక పేర్కొంది. ఈ పరిణామంతో అప్పులు తీసుకునే ధోరణి పెరిగిందని హోం క్రెడిట్ ఇండియా తాజా నివేదికలో వివరించింది.

కరోనా వల్ల విధించిన లాక్​డౌన్​ సమయంలో అప్పుల ధోరణిని అర్థం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో 1,000 మందికిపైగా ఈ సర్వే జరిగింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • దేశంలో 46 శాతం మంది తమ ఇంటి అవసరాలకు అప్పులు తీసుకున్నారు.
  • వేతనాల్లో కోత లేదా ఆలస్యం వంటివి చాలా మంది రుణాలు తీసుకునేందుకు ప్రధాన కారణం.
  • పాత రుణాలు తీర్చడం, ఈఎంఐల చెల్లించడం కోసం అప్పులు తీసుకున్నట్లు 27 శాతం మంది తెలిపారు.
  • 14 శాతం మంది ఉద్యోగం పోవడం వల్ల రుణాలు తీసుకోవాల్సి వచ్చినట్లు చెప్పారు.
  • పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక అప్పును తిరిగి చెల్లించే సౌలభ్యం కోసం.. కరోనా కాలంలో చాలా మంది స్నేహితులు, బంధువుల అప్పు తీసుకునేందుకు మొగ్గు చూపారు.
  • మళ్లీ ఉద్యోగంలో చేరాక, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పుడు తీసుకున్న అప్పులు చెల్లిస్తామని 50 శాతం మంది చెప్పారు.
  • ముంబయి, భోపాల్​లో అత్యధికంగా 27 శాతం మంది స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ (26 శాతం), పట్నా (25 శాతం) ఉన్నాయి.
  • అప్పులు తీసుకునే విషయంలో కుటుంబంలో పురుషులే నిర్ణయం తీసుకున్నట్లు 23 శాతం మంది వెల్లడించారు.

ఇదీ చూడండి:అక్కరకు రాని ఉద్దీపన- చేకూరని ప్రయోజనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.