ETV Bharat / business

కాంటాక్ట్​లెస్​ కార్డ్​ లావాదేవీల పరిమితి పెంపు: ఆర్బీఐ

author img

By

Published : Dec 4, 2020, 10:25 AM IST

Updated : Dec 4, 2020, 10:52 AM IST

RBI geverner
ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్

10:47 December 04

కాంటాక్ట్​లెస్​ కార్డ్​ లావాదేవీల పరిమితి పెంపు: ఆర్బీఐ

ఆర్​టీజీఎస్​ వ్యవస్థను కొద్ది రోజుల్లోనే 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు గవర్నర్​ శక్తికాంత దాస్​. కాంటాక్ట్​లెస్​ కార్డ్​ లావాదేవీల పరిమితిని జనవరి నుంచి రూ. 2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. వాణిజ్య, సహకార బ్యాంకులు 2019-20లో వచ్చిన లాభాలను నిలుపుకోవాలని సూచించారు. చాలా రంగాలు రికవరీ మార్గంలోకి వస్తున్న క్రమంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందని తెలిపారు.  

మూడో త్రైమాసికంగా సీపీఐ ద్రవ్యోల్బణం 6.8 శాతం, క్యూ4లో 5.8 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది ఆర్బీఐ.  

10:33 December 04

నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 0.7%

కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​. 

2021 ఏడాదికి దేశ జీడీపీ వృద్ధి రేటు -7.5 శాతంగా అంచానా వేస్తున్నట్లు తెలిపారు గవర్నర్​. పట్టణ డిమాండ్​తో పాటు గ్రామీణ డిమాండ్​ కూడా పెరుగుతుండటం.. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 0.1 శాతం, నాలుగో త్రైమాసికంగా 0.7 శాతంగా ఉండబోతున్నట్లు అంచనా వేసినట్లు పేర్కొన్నారు.  

10:15 December 04

ద్రవ్య పరపతి విధాన కమిటీ

కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్​బీఐ. ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉండటం ఇది వరసగా మూడోసారి. 

ఎంఎస్​ఎఫ్​:  4.25శాతం

రివర్స్​ రెపో రేట్​:  3.35శాతం

రెపో రేట్​:  4 శాతం

Last Updated : Dec 4, 2020, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.