ETV Bharat / business

ఆటో సేల్స్​పై 'చిప్'​ దెబ్బ- అక్టోబర్​లో 27% డౌన్

author img

By

Published : Nov 12, 2021, 2:37 PM IST

గత నెలలో వాహన విక్రయాలు(Auto sales in October) డీలా పడ్డాయి. ప్యాసింజర్‌ వాహనాల టోకు అమ్మకాల్లో 27 శాతం క్షీణత నమోదైనట్లు భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్‌) పేర్కొంది. సెమీకండక్టర్ల కొరత, ముడి సరకుల ధరల విపరీతమైన పెరుగుదల.. వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపాయని వెల్లడించింది.

Passenger vehicle dispatches
వాహన విక్రయాలు

అక్టోబర్‌ నెల ప్యాసింజర్‌ వాహనాల టోకు విక్రయాలు(Auto sales in October) గతేడాదితో పోలిస్తే 27 శాతం క్షీణించినట్లు భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్‌) వెల్లడించింది. సెమీకండక్టర్ కొరత ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. క్రితం సంవత్సరం అక్టోబర్‌లో 3,10,294 యూనిట్లను విక్రయించగా.. ఈ సారి 2,26,353 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు తెలిపింది.

ద్విచక్రవాహన టోకు విక్రయాల్లో 28 శాతం, మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లో 26 శాతం, స్కూటర్‌ విక్రయాల్లో 21 శాతం క్షీణత నమోదైంది. అన్ని విభాగాల్లో కలిపి(త్రీవీలర్​, ద్విచక్ర వాహనాలు, ఫోర్​వీలర్)​ విక్రయాలు 25 శాతం తగ్గాయి.

"2021-22 ఆర్థిక ఏడాది ప్రారంభంలో తగ్గిన వాహన విక్రయాలను దీపావళి పండగ సీజన్​లో పెంచడానికి తయారీదారులు ప్రయత్నించారు. అయినప్పటికీ.. సెమీకండక్టర్ల కొరత, ముడిసరకు ధరల్లో విపరీతమైన పెరుగుదల వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపాయి" అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మేనన్‌ తెలిపారు.

ఇదీ చూడండి: 'సింగిల్స్​ డే' సేల్స్​లో రికార్డ్​- రూ.10 లక్షల కోట్ల వ్యాపారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.