ETV Bharat / business

6 Airbags: 'ఆ కార్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు తప్పనిసరి'

author img

By

Published : Jan 15, 2022, 4:40 AM IST

6 Airbags: ఇక మీదట ఎనిమిది మంది ప్రయాణించే కార్లలో తప్పనిసరిగా ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు ఉండాలని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రయాణికుల భద్రత కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్​ను ఆమోదించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

6 Airbags
ఎయిర్‌ బ్యాగ్‌

6 Airbags: ప్రయాణికుల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఎనిమిది మంది ప్రయాణించే కార్లలో తప్పనిసరిగా ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ట్వీట్ చేశారు. దీనివల్ల ఎక్కువ మంది ప్రయాణించే కార్లలో కూడా భద్రత మెరుగవుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఆమోదించినట్లు మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.

2019 జులై 1 నుంచి డ్రైవర్‌ వైపు ఎయిర్‌బ్యాగ్ నిబంధనను తప్పనిసరి చేయగా, 2022 జనవరి 1 నుంచి అన్ని కార్లలో 2 ఎయిర్‌బ్యాగ్‌ల (డ్రైవరు, ముందు సీటు ప్రయాణికునికి) ఏర్పాటు తప్పనిసరి చేశారు. ఇటీవలే ఎనిమిది మంది ప్రయాణించే కార్లలో ధర, వేరియంట్‌తో సంబంధం లేకుండా అన్ని కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ల నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు గడ్కరీ ట్వీట్ చేశారు.

"ఎమ్‌1 వాహనాల శ్రేణిలో ప్రమాదాలు జరిగినప్పుడు ముందు, వెనుక కూర్చున్న వారికి భద్రత కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న రెండు ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు అదనంగా ఏర్పాటు చేయాలి. అంటే ముందు రెండు, డోర్స్‌కు ఇరువైపులా రెండు కర్టెన్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ ఉండాలి. భారత దేశంలోని కార్లను గతంలో కంటే మరింత సురక్షితంగా మార్చేందుకు, ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు ఇదో ముందడుగు" అని గడ్కరీ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ నిబంధన ఎప్పట్నుంచి అమలు కానుందనేది మాత్రం కేంద్ర మంత్రి వెల్లడించలేదు.

ఇదీ చూడండి: చిన్న కార్లయినా.. ఆరు ఎయిర్​బ్యాగ్స్​ తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.