ETV Bharat / business

కరోనా కష్టాల్లోనూ 'డాక్టర్​ రెడ్డీస్'కు రెట్టింపు లాభాలు

author img

By

Published : May 20, 2020, 9:38 PM IST

ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్​ రెడ్డీస్​ 2019-20 నాలుగో త్రైమాసికంలో రెట్టింపు లాభాలను గడించింది. గతేడాది నికర లాభం రూ.343 కోట్లతో పోలిస్తే.. ప్రస్తుతం రూ. 764 కోట్లను అర్జించినట్లు సంస్థ తెలిపింది.​

dr.reddies
రెట్టింపు లాభాల బాటలో డాక్టర్​ రెడ్డీస్

కరోనాతో విధించిన లాక్​డౌన్​ కారణంగా సంస్థలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ మాత్రం లాభాల బాటలో పయనిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఈ ప్రముఖ ఫార్మా సంస్థ.. 2019-20 సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రెట్టింపు లాభాలు అందుకుంది.

గతేడాది నాలుగో త్రైమాసికంలో నికర లాభం రూ. 343 కోట్ల కాగా.. ప్రస్తుతం రూ.764 కోట్ల లాభాలను అర్జించింది. బుధవారం హైదరాబాద్​లో ఫలితాలను ప్రకటించింది సంస్థ. 2018-19 నాలుగో త్రైమాసికంతో పోల్చితే ఆదాయం కూడా పది శాతం పెరిగి.. అర్జన రూ. 4432 కోట్లకు చేరింది.

సంస్థ ఉత్పత్తుల విక్రయాల్లో 5 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం రూ. 683.6 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ఫలితంగా ఉత్తర అమెరికాలో 21 శాతం వృద్ధి, ఐరోపాలో 80 శాతం, ఎమర్జింగ్ మార్కెట్లలో 15 శాతం పెరుగుదల నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా సంస్థ జనరిక్ ఔషధాల అమ్మకాల్లోనూ.. 20 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.