ETV Bharat / business

కొవిడ్​కు కొత్త మందు- ఒక్క స్ప్రేతో వైరస్​ ఖతం!

author img

By

Published : Feb 9, 2022, 2:23 PM IST

Glenmark nasal spray for covid: కొవిడ్​ చికిత్సకు దేశీయంగా మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఫ్యాబీస్ర్పే పేరుతో ముంబయికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం గ్లెన్​మార్క్​ నాజల్​ స్ప్రేని మార్కెట్​లోకి విడుదల చేసింది. కెనడాకు చెందిన సానోటైజ్​ అనే భాగస్వామ్య కంపెనీతో కలిసి దీనిని రూపొందించింది.

glenmark nasal spray for COVID-19 treatment in India
కరోనా నివారణకు గ్లెన్​మార్క్​ నాజల్​ స్ప్రే

Glenmark nasal spray for covid: దేశీయ ఫార్మా దిగ్గజం గ్లెన్​మార్క్ కరోనా వైరస్​కు సంబంధించిన కొత్తగా నాజల్​ స్ప్రేను తీసుకొచ్చింది. ఫ్యాబీస్ప్రే పేరుతో దీనిని విడుదల చేసింది. కెనడాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన సానోటైజ్​తో కలిసి ఈ నాజల్​ స్ప్రేను రూపొందించింది. కొవిడ్​తో బాధపడుతున్న పెద్ద వయసు వారి కోసం దీనిని తీసుకువచ్చినట్లు గ్లెన్​మార్క్​ తెలిపింది.

ఇప్పటికే గ్లెన్​మార్క్​ ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (ఎన్​ఓఎన్​ఎస్​) కోసం భారత ఔషధ నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకోగా.. తయారీ, మార్కెటింగ్​కు ఆమోదం తెలిపింది డీసీజీఐ. ఈ ఔషధం.. ఎగువ శ్వాస నాళాల్లోని వైరస్​ను చంపేస్తుందని తెలిపింది. లేకుంటే ఈ వైరస్​ తొలుత అక్కడ పాగా వేసి, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి విస్తరిస్తుంది. ఈ పరిస్థితిని ఎన్​ఓఎన్​ఎస్​ నివారిస్తుంది.

గతేడాది జులైలో నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే తయారీ, మార్కెటింగ్​ అనుమతుల కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది గ్లెన్​మార్క్​. కేవలం భారత్​లోనే కాకుండా సింగపూర్, మలేషియా, హాంకాంగ్‌ దేశాలతో పాటు ఇతర ఆసియా మార్కెట్‌లలో అనుమతులకు భాగస్వామ్య కంపెనీతో దరఖాస్తు చేసుకుంది.

కొవిడ్​కు ఔషధాన్ని తీసుకురావడం కారణంగా గ్లెన్​మార్క్​ షేర్లు 2 శాతం మేర పెరిగాయి.

ఇదీ చూడండి: రిలయన్స్​తో ఒప్పందంపై ఫ్యూచర్​ గ్రూప్​కు సుప్రీం నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.