ETV Bharat / briefs

నెటిజన్లను ఊపేస్తున్న కేఏ పాల్ టైసన్‌ బాక్సింగ్

author img

By

Published : Mar 23, 2019, 12:38 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విప్లవాత్మక మార్పు తీసుకొస్తామని... అందరికీ అధికారం... అవినీతి లేని పాలన ట్యాగ్‌లైన్‌తో ఆకట్టుకున్న కేఏపాల్.. మరోసారి నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్నారు. పవన్‌కు నాట్యం రాదంటూ... ఒకప్పుడు వేదికపై స్టెప్పులేసిన ఆయన.. ఇప్పుడు తన శిష్యుడు, బాక్సర్ ఇవాండర్ హోలీఫీల్డ్​ను మించి పిడిగుద్దులతో విశ్వరూపం చూపారు. అంతర్జాలంలో వైరల్‌ అవుతున్నారు.

హాస్యాస్పద నటనతో కేఏ పాల్

హాస్యాస్పద నటనతో కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్... మరోసారి నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. ఒకరోజు పాటపాడి అలరిస్తే... మరోసారి స్టెప్పులేసి సందడి చేస్తే... ఇప్పుడు ఏకంగా ఫైట్ చేసి నవ్వులు పూయిస్తున్నారు.తన కారులో ఎక్కడికోవెళ్తుండగా... కొందరు వాహనదారులు ఆయన్ని పలకరించారు. అంతే ఆయన రెచ్చిపోయారు. కారులో కూర్చొనే బాక్సింగ్‌ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఊగిపోయారు. చిత్రవిచిత్ర సైగలతో అక్కడి వారందరినీ నవ్వించారు. అది కాస్తా రికార్డు చేసిన కొందరు ''పాల్ అభిమానులు''.. సోషల్​ మీడియాలో పెట్టేశారు.ఆ వీడియో ఇప్పుడు 'నెట్​'ఇంట్లో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండిఃతెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ తనిఖీలు

Intro:av


Body:తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాపాక వరప్రసాదరావు రాజోలి గ్రామం దొరగారి తోటలో శనివారం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరిగి జనసేన కరపత్రాలు ఇచ్చే పార్టీ సిద్ధాంతాలను వివరించారు అవినీతి రహిత పాలన పవన్ కళ్యాణ్ తో సాధ్యమని అన్నారు


Conclusion:madhu razole
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.