ETV Bharat / bharat

భాజపా ఎమ్మెల్యేకు జెడ్ కేటగిరి భద్రత

author img

By

Published : Dec 29, 2021, 9:57 PM IST

Z category security To Punjab MLA: పంజాబ్ ఎమ్మెల్యే రాణా గుర్మిత్ సింగ్ సోఢీకి కేంద్ర ప్రభుత్వం జెడ్​(Z) కేటగిరి వీఐపీ భద్రత కల్పించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. సోఢీ ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరారు.

Z security persons list in India 2021
రాణా గుర్మిత్ సింగ్ సోధీ

Z category security To Punjab MLA: ఇటీవల భాజపాలో చేరిన పంజాబ్ ఎమ్మెల్యే రాణా గుర్మిత్ సింగ్ సోఢీకి కేంద్ర ప్రభుత్వం జెడ్​(Z) కేటగిరి వీఐపీ భద్రత కల్పించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. సోఢీ గత నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు సన్నిహితుడిగా మెలిగారు. అమరీందర్ ప్రభుత్వంలో క్రీడా మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. డిసెంబర్ 21న భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు సోఢీకి జెడ్ కేటగిరి భద్రత కల్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా పంజాబ్, దిల్లీలో ఆయన పర్యటించిన ప్రతిసారి సీఆర్​పీఎఫ్​ కమాండోలు రక్షణ కల్పించనున్నట్లు వెల్లడించాయి. సోఢీతో పాటు ఆరు నుంచి ఎనిమిది మంది కమాండోల బృందం నిరంతరం ఆయన వెంటే ఉండనుందని సమాచారం.

Z security persons list in India 2021: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీతో సహా 76 మంది వ్యక్తులకు వీఐపీ భద్రత కింద ఈ దళం రక్షణ కల్పిస్తుంది.

ఇదీ చదవండి: మాజీ హోం మంత్రిపై ఈడీ ఛార్జిషీట్​.. భార్య, కుమారులపైనా..

ప్రధాని న్యూ ఇయర్​ గిఫ్ట్​.. ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.