ETV Bharat / bharat

కూలీలకు వేడివేడి కిచిడీ- బాటిళ్లలో నింపి లోపలకు- సొరంగంలోని కార్మికుల లైవ్​ వీడియో

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 8:26 AM IST

Updated : Nov 21, 2023, 8:57 AM IST

Uttarakhand Tunnel Collapse Latest News : ఉత్తరాఖండ్​లో సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకుతీసుకొచ్చేందుకు జరుగుతున్న సహాయక చర్యల్లో అధికారులు భారీ విజయం సాధించారు. ఇప్పటి వరకు పైపు ద్వారా డ్రైఫ్రూట్స్​ పంపిన అధికారులు.. తొలిసారి వేడివేడి కిచిడీని పంపారు. లోపల కార్మికులను ప్రత్యక్షంగా చూశారు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటే?

Uttarakhand Tunnel Collapse Latest News
Etv Uttarakhand Tunnel Collapse Latest News

Uttarakhand Tunnel Collapse Latest News : 10 రోజులు.. 41 మంది కార్మికులు.. అనూహ్యంగా సొరంగంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. కేవలం డ్రై ఫ్రూట్సే కాకుండా వేడివేడి కిచిడీతోపాటు ఇతర ఆహార పదార్థాలు అందిస్తోంది. అసలు వారు లోపల ఎలా ఉన్నారు? ఆహారం ఎలా అందుకుంటున్నారు? వేడివేడి కిచిడీని ఎలా పంపారు అధికారులు? వైద్యుల సలహాల మేరకే ఆహారాన్ని పంపుతున్నారా? కూలీలతో అధికారులు ఎలా మాట్లాడుతున్నారు?

ఉత్తరాఖండ్​ ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పగలురాత్రి తేడా లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. పక్కా ప్రణాళికలతో చేపడుతున్న సహాయక చర్యల్లో భారీ విజయం సాధించారు. ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టాన్ని.. సొరంగ శిథిలాల ద్వారా పంపించగలిగారు. దాని ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు. లోపల ఉన్న కార్మికులను ప్రత్యక్షంగా చూశారు.

  • #WATCH | Uttarkashi tunnel accident: The rescue team has started the work of laying the pipeline inside the Silkyara Tunnel

    (Visuals from inside the tunnel) pic.twitter.com/U1R419HauM

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) November 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తొలిసారి వేడి ఆహారం..
సొరంగం కూలిన ఘటన తర్వాత నాలుగు అంగుళాల గొట్టపు మార్గం ద్వారా కేవలం డ్రైఫ్రూట్సే పంపిన అధికారులు.. తొలిసారి వేడివేడి ఆహారాన్ని కూలీలకు అందించారు. వెడల్పు అయిన వాటర్ బాటిళ్లలో కిచిడీని నింపి.. ఆరు అంగుళూల వ్యాసం పైపు ద్వారా అధికారులు పంపారు. పలువురు వంట మనుషులు.. కూలీలకు అవసరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు.

  • #WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel Rescue: Food items including Khichdi, Dal are being prepared and packed to be delivered to the people trapped inside the tunnel

    Cook Hemant says, "Food will be sent to the people trapped inside. For the first time, hot food is being sent… pic.twitter.com/dAVZSSi1Ne

    — ANI (@ANI) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కూలీలకు అందించేందుకు వేడివేడి కిచిడీని తయారు చేశాం. బాటిళ్లలో నింపి అధికారులకు అందించాం. అధికారులు చెప్పినట్లే ఆహారాన్ని సిద్ధం చేశాం. కిచిడీ తర్వాత పప్పును కూడా పంపాం"

-- హేమంత్​, వంట మనిషి

మనిషికి 750 గ్రాముల చొప్పున..
సొరంగంలో ఉన్న కూలీల ఒక్కొక్కరికి 750 గ్రాముల చొప్పున ఆహారాన్ని సిద్ధం చేస్తున్నామని మరో వంట మనిషి రవి రాయ్​ తెలిపారు. ముందు కిచిడీ పంపామని, తర్వాత నారింజ, యాపిల్స్​ పంపుతామని చెప్పారు. నిమ్మరసాన్ని కూడా పంపనున్నట్లు వెల్లడించారు.

  • #WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel Rescue: Cook Ravi Roy says, "Food will be sent to the people trapped inside. We have prepared food for 41 people. 750 gm has been prepared for one person. For the first time, hot food is being sent to them. Today Khichdi is being sent to… https://t.co/hiD0GVLUj7 pic.twitter.com/skTODRaOoZ

    — ANI (@ANI) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైద్యుల సలహాల మేరకే ఆహారాన్ని పంపుతున్నారా?
41 మంది కూలీల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. వైద్యుల సహకారంతో రెస్క్యూ అధికారులు.. జాబితాను సిద్ధం చేశారు. తక్షణ బలాన్నిచ్చే అరటిపండ్లు, యాపిల్స్​, డలియా వంటి పంపుతున్నారు.

"టన్నెల్​లో ఉన్న కూలీలను ఎలాంటి ఆహారం పంపించాలో వైద్యుల సహకారంతో జాబితా సిద్ధం చేశాం. ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టం ద్వారా వైద్యుల సూచించిన ఆహార పదార్థాలను పంపిస్తున్నాం. సహాయక చర్యల్లో కీలక పురోగతి సాధించాం. దీని తర్వాత టన్నెల్​లో ఆనంద వాతావరణం నెలకొంది"

-- కల్నల్​ దీపక్​ పాటిల్​, రెస్క్యూ ఆపరేషన్​ ఇన్​ఛార్జ్​

కూలీలను అధికారులు చూస్తున్నారా?
సొరంగంలో కూలీలు ఉన్నచోట దృశ్యాలను.. ఆరు అంగుళాల పైపు ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా అధికారులు చూశారు. అందుకు కోసం ఎండోస్కోపీ తరహా ఓ కెమెరాను ఉపయోగించారు. సొరంగం లోపల దృశ్యాలను అధికారులు షేర్ చేశారు. కూలీలంతా తెలుపు, పసుపు రంగు హెల్మెట్లు ధరించి ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు.

సొరంగం లోపల దృశ్యాలు
  • VIDEO | First visuals of workers stuck inside the collapsed Silkyara tunnel in #Uttarkashi, Uttarakhand.

    Rescuers on Monday pushed a six-inch-wide pipeline through the rubble of the collapsed tunnel allowing supply of larger quantities of food and live visuals of the 41 workers… pic.twitter.com/mAFYO1oZwv

    — Press Trust of India (@PTI_News) November 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కూలీలతో అధికారులు ఎలా మాట్లాడుతున్నారు?
కూలీలతో అధికారులు మాట్లాడేందుకు ఒక వాకీ- టాకీని పంపారు. దాంతో పాటు రెండు ఛార్జర్​లు కూడా పంపారు. దాని ద్వారా అధికారులు.. కూలీలతో మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా.. కార్మికుల్లో మనోస్థైర్యాన్ని నింపుతున్నారు. అయితే శిథిలాలకు రెండోవైపు వరకు 53 మీటర్ల లోతున పైపును పంపించడం వల్ల కూలీలు తాము చెప్పినదానిని వినగలుగుతున్నారని అధికారులు తెలిపారు

  • #WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel Rescue: Nipu Kumar, a safety staff says, "A Walkie-talkie has been sent inside to establish communication. Two chargers are also being sent. Food will be sent. Other necessary items will be also sent to them if they require any." pic.twitter.com/mAftncFmee

    — ANI (@ANI) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కూలీతో కమ్యూనికేషన్​ కోసం ఒక వాకీ-టాకీ పంపించారు. రెండు ఛార్జర్లు కూడా పంపాం. అవసరమైన అన్ని వస్తువులను పంపిస్తున్నాం"

-- నిపు కుమార్​, రెస్యూ సిబ్బంది.

యుద్ధప్రాతిపాదికన కృషి
అయితే సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపాదికన కృషి చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామి తెలిపారు. "ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అందులో భాగంగా శిథిలాల మీదుగా 6 అంగుళాల వ్యాసం కలిగిన పైప్‌లైన్‌ను విజయవంతంగా చొప్పించాం. ఇప్పుడు దీని ద్వారా ఆహార పదార్థాలు, మందులు, ఇతర వస్తువులను కార్మికులకు అందజేస్తాం" అని సీఎం.. ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

  • सिल्क्यारा, उत्तरकाशी में निर्माणाधीन टनल में फँसे श्रमिकों को आज 6 इंच व्यास की पाइप मलबे के आरपार होने के बाद पहली बार खिचड़ी भेजी गई है।

    सभी श्रमिक भाइयों को सकुशल बाहर निकालने हेतु निरंतर बचाव कार्य गतिमान है। pic.twitter.com/fN8KlH0gau

    — Pushkar Singh Dhami (@pushkardhami) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'సొరంగంలోని కూలీల ప్రాణాలకు ముప్పు- రెస్క్యూ ఆపరేషన్​ వేగవంతం చేయాల్సిందే!'

రంగంలోకి అంతర్జాతీయ నిపుణుడు- త్వరలోనే కూలీలు బయటకు! సహాయక చర్యలపై మోదీ ఆరా

Last Updated : Nov 21, 2023, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.