ETV Bharat / bharat

యూపీలో మహిళా ఓటర్లే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో

author img

By

Published : Nov 1, 2021, 12:51 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో(UP polls 2022) గెలుపే లక్ష్యంగా కసరత్తు ముమ్మరం చేస్తుంది కాంగ్రెస్​ పార్టీ. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(UP election priyanka gandhi).. మహిళ కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించినట్లు పేర్కొన్నారు. ఉచితంగా ఎల్​పీజీ సిలండర్లు సహా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

up election priyanka gandhi
యూపీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల (UP election 2022) దృష్ట్యా.. కాంగ్రెస్​ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మహిళా ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడం కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(UP election priyanka gandhi) పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపిస్తే.. మహిళలకు ఉచితంగా వంటగ్యాస్​ అందిస్తామని.. ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రియాంక ప్రకటించారు.

"నా ప్రియమైన ఉత్తర్​ప్రదేశ్​ సోదరీమణులరా.. మీరు రోజూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాటిని అర్థం చేసుకున్న కాంగ్రెస్​ పార్టీ.. మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించింది. మా పార్టీ అధికారంలోకి వస్తే.. ఏడాదికి మూడు ఎల్​పీజీ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం" అని ప్రియాంక హిందీలో ట్వీట్​ చేసింది. వీటితో పాటు మరిన్ని హామీల జాబితాను ఆ ట్వీట్​కు జోడించారు ప్రియాంక.

మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యాంశాలు

  • ఆశ, అంగన్​వాడీ వర్కర్లకు రూ.10,000 గౌరవ వేతనం.
  • రిజర్వేషన్​ ప్రకారం ఉద్యోగాల్లో 40 శాతం మహిళల నియామకం
  • వితంతువులకు రూ.1,000 పింఛను
  • 75 నైపుణ్య పాఠశాలను నిర్మించి.. వాటికి ఉత్తర్​ప్రదేశ్​ వీరనారీమణుల పేర్లను పెడతాం.

గతనెల.. ఇంటర్​ పాసయిన బాలికలకు ఉచితంగా స్మార్ట్​ఫోన్లు, డిగ్రీ పూర్తి చేసిన యువతులకు ఈ-స్కూటర్లు అందిస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లులను పేద కుటుంబాలకు పూర్తిగా, మిగిలిన వారికి సగం మాఫీ చేస్తామన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.