ETV Bharat / bharat

300 కిలోల బంగారం చోరీ.. అనేక బ్యాంకులకు కన్నం.. పట్టుబడ్డ ఇద్దరు దొంగలు!

author img

By

Published : Nov 28, 2022, 10:31 PM IST

ఓ దొంగల ముఠా పట్టపగలే బ్యాంకులోకి ప్రవేశించి.. తుపాకులతో బెదిరించి రూ. 5 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లింది. ఈ దొంగతనం మధ్యప్రదేశ్​లో నవంబర్​ 26న జరిగింది. నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్నారు పోలీసులు. గతంలో వివిధ దోపిడీలకు పాల్పడిన ఈ ముఠా.. దాదాపు 300కిలోల బంగారాన్ని దోచుకెళ్లిన్నట్లు గుర్తించారు.

బైక్​పై వచ్చి బ్యాంకు దొంగతనానికి దొంగలు
బైక్​పై వచ్చి బ్యాంకు దొంగతనానికి దొంగలు

మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ఓ బ్యాంకు నుంచి బిహార్‌కు చెందిన దొంగల ముఠా దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారం, రూ.3.5 లక్షల నగదును దోచుకెళ్లింది. ఈ ఘటన శనివారం జరిగింది. ముసుగులు ధరించిన ఆరుగురు దొంగలు ఆయుధాలతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి ఈ దోపిడీకి పాల్పడినట్లు ఎస్పీ ఎస్‌కే జైన్‌ వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముఠాలోని ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. ఈ ముఠా వివిధ చోరీల్లో 300 కిలోల బంగారాన్ని దోచుకున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. వీటి విలువ దాదాపు రూ.150కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం వారిని రిమాండ్​కు తరలించి విచారిస్తున్నట్లు వెల్లడించారు.

బార్గవాన్‌ ప్రాంతంలో ఉన్న ఓ బ్యాంకుకు సరైన భద్రతా ఏర్పాట్లు లేవని.. ఇదే అదనుగా భావించిన దొంగలు నవంబర్​ 26న బ్యాంకులోకి ప్రవేశించారు. సిబ్బందిని తుపాకులతో బెదిరించి దొంగతనాని పాల్పడ్డారు. ఈ ముఠాలో అంతా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఉన్నారని.. వీరంతా బిహార్‌ వాసులని పోలీసులు పేర్కొన్నారు. అరెస్టైన ఇద్దరిని 10 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. వీరిని విచారించిన పోలీసులు.. ముఠా సూత్రధారి సుబోధ్‌ సింగ్‌ బిహార్‌లోని బీర్‌ జైలులో ఉన్నట్లు తెలుసుకున్నారు. అరెస్టయిన వారిని పట్నాకు చెందిన శుభం తివారీ(24), బక్సర్‌కు చెందిన అంకుశ్​ సాహు(25)గా గుర్తించారు.

5 cr gold robbery in MP
బైక్​పై వచ్చి బ్యాంకు దొంగతనానికి దొంగలు

ఆగస్టు 29న ఉదయ్‌పుర్‌లోని ఓ బ్యాంకులో ఈ ముఠా 24 కిలోల బంగారం, రూ.11 లక్షల నగదును దోచుకున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. ఈ ముఠా దేశంలోని ధన్‌బాద్, ఆగ్రా, హౌరా తదితర ప్రాంతాల్లో బంగారం దోపిడీలకు పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. కట్నీ దోపిడీలో పాల్గొన్న మరో నలుగురిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.