ETV Bharat / bharat

ఆ పార్టీ నేతలకు ఇన్నోవా కార్లు గిఫ్ట్​!

author img

By

Published : Aug 22, 2021, 8:41 PM IST

Updated : Aug 23, 2021, 9:26 AM IST

కొందరు నేతలకు ఓ పార్టీ ఇన్నోవా కార్లను గిఫ్ట్​గా ఇచ్చింది. ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచేందుకు.. వారు చేసిన కృషికి గాను ఈ కార్లు దక్కించుకున్నారు. ఇంతకూ ఎక్కడంటే..

TN BJP State unit gifts Innova cars to the district Secretaries
ఆ పార్టీ నేతలకు ఇన్నోవా కార్లు గిఫ్ట్​!

తమిళనాడు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన నాలుగు జిల్లాల కార్యదర్శులకు ఇన్నోవా కార్లను కానుకగా ఇచ్చింది భాజపా. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. సుమారు 20ఏళ్ల తరువాత రాష్ట్రంలో కమలనాథులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించగలిగారు. దీంతో వారు గెలిచిన జిల్లాల కార్యదర్శులకు ఇలా కార్లను కానుకగా ఇచ్చింది పార్టీ అధిష్ఠానం.

ఇన్నోవా కార్లు దక్కించుకున్న వారిలో కోయంబత్తూర్​ సెక్రెటరీ నందకుమార్​, తిరునెల్వేళ్లి సెక్రెటరీ మహారాజన్​, ఏరోడ్​ సెక్రెటరీ సుబ్రమణియన్​, కన్యాకుమారి సెక్రెటరీ ధర్మరాజన్​లు ఉన్నారు. వీరికి కేంద్రమంత్రి ఎల్​ మురగన్​ కార్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై, పార్టీ సీనియర్​ నేత సీపీ రాధాక్రిష్ణన్​లు హాజరయ్యారు.

ఎల్​. మురగన్​ గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు.. అభ్యర్థులు గెలిస్తే ఇన్నోవా కార్లు ఇస్తామని హామీనిచ్చారు. ఈ మేరకు వారిని గెలిపించిన జిల్లా కార్యదర్శులకు కానుకలు ఇచ్చారు.

ఇదీ చూడండి: 'తాలిబన్ల నుంచి బయటపడ్డాం- ఇక మనం భద్రం!'

Last Updated : Aug 23, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.