ETV Bharat / bharat

హైదరాబాద్​లో విషాదం.. విద్యుదాఘాతంతో ముగ్గురు అన్నదమ్ములు మృతి

author img

By

Published : Apr 13, 2023, 7:23 AM IST

Updated : Apr 13, 2023, 8:51 AM IST

electric shock
electric shock

06:31 April 13

బంజారాహిల్స్‌లో విద్యుదాఘాతంతో ముగ్గురు అన్నదమ్ములు మృతి

హైదరాబాద్​లో విషాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లోని పారామౌంట్‌ కాలనీలో విద్యుదాఘాతంతో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. నీటి సంపు శుభ్రం చేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో ఈ ఘటన జరిగింది. మృతులు అన్నస్‌(19), రజాక్‌‍‌(18), రిజ్వాన్‌‍‌(16)గా గుర్తించారు. మొదట సంపులోకి దిగిన రజాక్​కు కరెంట్ షాక్ రావడం గమనించిన తన సోదరులు అన్నస్, రిజ్వాన్.. అతణ్ని కాపాడేందుకు సంపులోకి దిగారు. ఈ క్రమంలో వారికి కూడా షాక్ తగిలి చనిపోయారు. ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Apr 13, 2023, 8:51 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.