ETV Bharat / bharat

17 ఏళ్లకే ఓటు హక్కు కోసం నమోదు.. ఈసీ కొత్త రూల్స్

author img

By

Published : Jul 28, 2022, 3:08 PM IST

17 ఏళ్ల దాటిన వారు కూడా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటును కల్పించింది ఎన్నికల సంఘం. ఓటు హక్కు దరఖాస్తు చేసేందుకు ఇక నుంచి 18 ఏళ్లు దాటేవరకు వేచిచూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

election commission
ఎన్నికల సంఘం

యువకులు తమ ఓటు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని అవకాశాలు కల్పించింది. ఇప్పటివరకు 18 ఏళ్లు నిండినవారు మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఇకపై 17 ఏళ్లు దాటినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ సూచించింది. 18 ఏళ్లు పూర్తికాగానే.. వారికి ఓటు హక్కు లభిస్తుందని స్పష్టం చేసింది. ఓటు హక్కు నమోదు కోసం ఏటా జనవరి ఒకటి వరకు వేచిచూడాల్సిన అవసరం లేదని ఈసీ పేర్కొంది.

ఓటు నమోదు చేసుకునేందుకు అర్హత తేదీ అయిన జనవరి ఒకటితో పాటు ఇక నుంచి ఏప్రిల్‌ ఒకటి, జులై ఒకటి, అక్టోబర్‌ ఒకటిని కూడా అర్హత తేదీలుగా గుర్తించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఓటరు జాబితా అప్‌డేట్‌ అవుతుందని వివరించింది. 17 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు సాంకేతికంగా తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.

ఇదీ చూడండి : జలపాతం వద్ద పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన ముగ్గురు మహిళలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.