కోటికి అయిదు కోట్లు - తెలంగాణ ఎన్నికలపై రంగంలోకి దిగిన బెట్టింగ్ గ్యాంగ్​లు -ప్రత్యేక గ్రూపులు, యాప్​లు

author img

By ETV Bharat Telugu Desk

Published : Nov 16, 2023, 10:45 AM IST

Telangana_Elections_Betting

Telangana Elections Betting: వంద రూపాయలకి 500.. కాదు కాదు.. 100కి వెయ్యి రూపాయలు. అబ్బే ఇవన్నీ కాదు పెద్దగానే వేద్దాం.. కోటికి 5 కోట్లు. ఈ లెక్కలు అన్నీ ఏంటా అని అనుకుంటున్నారా. తెలంగాణలో ఎన్నికల వేళ.. బెట్టింగ్ రాయుళ్లు తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ గెలుపు గుర్రాలపై కోట్లలో పందేలు కాస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు, యాప్​లు, భారీ నెట్​వర్క్.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి.

Telangana Elections Betting: తెలంగాణలో బీఆర్​ఎస్ హ్యాట్రిక్‌ కొడుతుందా.. కాంగ్రెస్‌కు ఓ ఛాన్స్‌ వస్తుందా.. బీజేపీ జెండా ఎగురుతుందా.. ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ నలుగురు కలిసినా ఇప్పుడు ఇదే చర్చ. అయితే తెలంగాణలో ఎన్నికల ఫలితాలతో పాటు, ప్రముఖుల జయాపజయాలపై ఆంధ్రప్రదేశ్‌లో వందల కోట్ల రూపాయల మేర పందేలు (బెట్టింగులు) కాస్తున్నారు. ఈ మేరకు రంగంలోకి దిగిన దళారులు వాట్సప్‌ గ్రూప్‌లు క్రియేట్ చేసి వీటిని నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా తలపడుతుండటంతో ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులూ రంగంలోకి దిగారు.

తెలంగాణలో ప్రముఖులు బరిలో నిలిచిన నియోజకవర్గాలపై అధికశాతం పందేలు జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, ఉప్పల్‌, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌తో పాటు రాష్ట్రంలోని కరీంనగర్‌, హుజూరాబాద్‌, సూర్యాపేట, దుబ్బాక, గజ్వేల్‌ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై 1:5 (100 రూపాయలకి 500) చొప్పున పందేలు కాస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు బరిలో నిలిచినచోట వారికి వచ్చే మెజార్టీలపై 1:10 (100 రూపాయలకి వెయ్యి) అంటూ దళారులు ఊరిస్తున్నారు.

'బఘేల్​కు రూ.508కోట్లు!'- 'కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారానికి బెట్టింగ్​ సొమ్ము, సీఎం జైలుకు వెళ్లడం పక్కా'

గెలిస్తే 5 కోట్ల రూపాయలు: ఏపీలోని.. పశ్చిమగోదావరి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలకు చెందిన క్రికెట్‌, కోడి పందేల నిర్వాహకులు తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఐపీఎల్‌, ప్రపంచకప్‌ క్రికెట్‌లో బెట్టింగ్​లు వేసి నష్టపోయిన వారిని ఏజెంట్లుగా మార్చుకొని దందా ప్రారంభించారు. భీమవరం ప్రాంతానికి చెందిన ఓ రొయ్యల చెరువు వ్యాపారి శేరిలింగంపల్లిలో విజయం సాధించబోయే పార్టీపై కోటి రూపాయల పందెం కాసినట్లు విశ్వసనీయ సమాచారం. గెలిస్తే 5 కోట్ల రూపాయల లాభం, ఓడితే కోటి రూపాయల నష్టం అంటూ ఖాళీ బ్యాంకు చెక్కులను దళారుల చేతికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్‌లో మూడు ప్రధాన పార్టీల గెలుపోటములు, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చే మెజార్టీలపై కూడా స్థానికంగా భారీగా పందేలు​ కాస్తున్నారు.

సీఎం ఎవరు: తెలంగాణలో తదుపరి సీఎం ఎవరు అన్న విషయంపై సైతం బెట్టింగులు జరుగుతున్నాయి. బీఆర్​ఎస్ నెగ్గితే మూడోసారి కేసీఆర్‌ సీఎం అవుతారు. అయితే హస్తం పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై.. కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖులు, సీనియర్లపైనా పందేలు కాస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ప్రధాన పార్టీ నాయకుడి కనుసన్నల్లో ఇప్పటికే బెట్టింగ్ ఏజెంట్లు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

Dream11 One Crore Winner : బంగ్లా-ఇంగ్లండ్​ మ్యాచ్​లో బెట్టింగ్​.. ఎస్​ఐ​కు రూ.1.5 కోట్ల జాక్​పాట్​.. సో లక్కీ గురూ!

ముంబయి, దిల్లీకి చెందిన బెట్టింగ్‌ గ్యాంగ్​లు: బీఆర్​ఎస్-కాంగ్రెస్‌ జయాపజయాలపైనే ఎక్కువగా పందేలు జరుగుతున్నాయని హైదరాబాద్‌కు చెందిన ప్రధాన పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. ముంబయి, దిల్లీకి చెందిన బెట్టింగ్‌ గ్యాంగ్​లు కూడా తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

రాష్ట్రంలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వాట్సప్‌ గ్రూపులు, యాప్‌ల ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 100 రూపాయలకు 5 వేల - 6 వేల రూపాయల లాభాలు వస్తాయని ఊరిస్తూ కూడా పెద్దఎత్తున వసూలు చేయడం ఈ ముఠాల ప్రత్యేకత. బెట్టింగ్​లో గెలిచిన వారికి ఇవ్వాల్సిన సొమ్ములో కమీషన్లు వంటివాటి పేరిట సగం కొట్టేస్తారని ఆ అధికారి వివరించారు.

Josh Tongue Bet : నేషనల్ టీమ్​కు ఆడతాడని 11ఏళ్ల క్రికెటర్​పై బెట్టింగ్.. రూ.50లక్షలు జాక్​పాట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.