ETV Bharat / bharat

అంబులెన్స్​కు డబ్బులు లేక అవస్థలు.. తల్లి మృతదేహాన్ని తండ్రితో కలిసి భుజంపై మోస్తూ..

author img

By

Published : Jan 5, 2023, 10:03 PM IST

బంగాల్​లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి మృతదేహాన్ని అంబులెన్స్​లో తరలించేందుకు డబ్బులు లేక ఓ కుమారుడు తన తండ్రితో కలిసి భుజంపై మోసుకెళ్లాడు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

Etv Bharat
Etv Bharat

అంబులెన్స్​కు డబ్బులు లేక నానావస్థలు.. తల్లి మృతదేహాన్ని తండ్రితో కలిసి భుజంపై మోస్తూ..

బంగాల్​లోని జల్​పాయ్​గుడీలో హృదయవిదారక ఘటన జరిగింది. మహిళ మృతదేహాన్ని ఆమె భర్త, కొడుకు భుజంపై మోసుకెళ్లడం కలకలం రేపింది. అంబులెన్స్ డ్రైవర్ అడిగిన రూ.3 వేలు ఇవ్వలేక వారు ఇలా చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
ఇదీ జరిగింది..
జల్​పాయ్​గుడీలోని క్రాంతి బ్లాక్​కు చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి రోజువారి కూలీ. అతడి తల్లి లక్ష్మీరాణి శ్వాశకోశ వ్యాధులతో బాధపడేది. దీంతో రాంప్రసాద్ ఆమెను జలపాయ్​గుడీలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమె చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. తల్లి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్​ను బేరమాడాడు రాంప్రసాద్​. అంబులైన్స్ డ్రైవర్ రూ.3 వేలు ఇస్తే మృతదేహాన్ని ఇంటి దగ్గర దింపుతామని చెప్పాడు. అన్ని డబ్బులు రాంప్రసాద్ దగ్గర లేక తల్లి మృతదేహాన్ని తండ్రితో కలిసి భుజంపై మోసుకెళ్లాడు. ఇంతలో వీరిని 'గ్రీన్ జల్​పాయ్​గుడీ' అనే స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి అంకుర్ దాస్ వీరిని గమనించారు. వెంటనే ఆ సంస్థకు చెందిన అంబులెన్స్​ను తెప్పించి అందులో మహిళ మృతదేహాన్ని తరలించారు.

Son carries mothers body on shoulder
తల్లి మృతదేహాన్ని మోస్తున్న కుమారుడు

'గ్రీన్ జల్​పాయ్​గుడీ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి అంకుర్ దాస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. మృతురాలి కుటుంబీకులు అంబులెన్స్​ కావాలని వచ్చారు. వారు మేము అడిగిన డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు లేవని చెబితే ఉచితంగా మృతదేహాన్ని వారింటికి తరలించేవాళ్లం. చాలా మంది పేదల మృతదేహాలను ఉచితంగా అంబులెన్సుల్లో దింపాం. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్ర ఇది.'

-- దిలీప్ దాస్​, ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్స్ అసోసియేషన్ సెక్రటరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.