ETV Bharat / bharat

బార్​లో రహస్య గది.. అద్దం పగలగొడితే  17మంది అమ్మాయిలు

author img

By

Published : Dec 13, 2021, 11:35 AM IST

Updated : Dec 14, 2021, 6:30 PM IST

Secret room in Dance bar: నిబంధనలకు విరుద్ధంగా యువతులతో నృత్యాలు చేయిస్తున్న బార్​పై పోలీసులు దాడి చేశారు. బార్ బేస్​మెంట్​లోని రహస్య గదిలో దాక్కున్న 17 మంది డ్యాన్సర్లపై కేసు నమోదు చేశారు.

Police raid dance bar
Police raid dance bar

బార్​లో రహస్య గది.. అద్దం పగలగొడితే 17మంది అమ్మాయిలు

Secret room in Dance bar: మహిళలతో డ్యాన్సులు చేయిస్తున్న బార్​ గుట్టు రట్టు చేశారు ముంబయి పోలీసులు. అంధేరీలోని దీప బార్​లో సోషల్ సర్వీస్ విభాగ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బార్ బేస్​మెంట్​ గోడలో 17 మంది యువతులను గుర్తించారు.

police raid bar
రహస్య గది

నిబంధనలకు వ్యతిరేకంగా బార్​లో నృత్య కార్యక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి... రాత్రి 11.30 తర్వాత తనిఖీలు చేశారు. అయితే, పోలీసుల రాకను గమనించిన డాన్సర్లు, బార్ సిబ్బంది.. అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే, బార్ లోపలికి వచ్చిన పోలీసులు.. ప్రతి మూలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టోరేజీ గదులు, వంటశాలలు సహా గదులన్నింటినీ తనిఖీ చేశారు. కానీ ఏమీ లభించలేదు. చివరకు బార్ మేనేజర్, క్యాషియర్, వెయిటర్లను గంటల పాటు విచారించారు.

police raid bar
అద్దం పగులగొడుతున్న పోలీసులు

Mumbai Dance bar raid

ఈ క్రమంలో ఓ అద్దం వారికి అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని పగులగొట్టిన పోలీసులకు వెనక ఉన్న రహస్య గది తారసపడింది. మొత్తం 17 మంది డ్యాన్సర్లు అందులో దాక్కున్నారు. ఈ రహస్య గదిలో ఏసీలు, శీతల పానీయాలు, ఆహార ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బార్ మేనేజర్, క్యాషియర్​తో పాటు 17 మంది డ్యాన్సర్లపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: 'రక్తదానం చేసిన వారికి 2కిలోల చికెన్, అరకిలో పనీర్​'

Last Updated : Dec 14, 2021, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.